కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • mwb18 మార్చి పేజీ 7
  • “అప్రమత్తంగా ఉండండి”

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • “అప్రమత్తంగా ఉండండి”
  • మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
  • ఇలాంటి మరితర సమాచారం
  • మీరు “మెలకువగా” ఉంటారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2015
  • మెలకువగా ఉండడం గురించి పాఠం—పదిమంది కన్యలు
    యేసే మార్గం, సత్యం, జీవం
  • మీరు హెచ్చరికల్ని పట్టించుకుంటున్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (అధ్యయన)—2024
  • ‘నమ్మకమైన దాసుడు’ పరీక్షలో కృతార్థుడయ్యాడు!
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
మరిన్ని
మన క్రైస్తవ జీవితం, పరిచర్య—మీటింగ్‌ వర్క్‌బుక్‌—2018
mwb18 మార్చి పేజీ 7
యేసు ఉపమానంలో పదిమంది కన్యలు

దేవుని వాక్యంలో ఉన్న సంపద | మత్తయి 25

“అప్రమత్తంగా ఉండండి”

25:1-12

పదిమంది కన్యల ఉపమానం యేసు తన అభిషిక్త అనుచరులకే చెప్పినా, అందులోని ముఖ్య పాఠం క్రైస్తవులందరికీ వర్తిస్తుంది. (w15 3/15 12-16) “కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఎందుకంటే ఆ రోజు గానీ, ఆ గంట గానీ మీకు తెలీదు.” (మత్త 25:13) యేసు చెప్పిన ఉపమానాన్ని మీరు వివరించగలరా?

  • పెళ్లికొడుకు (1వ వచనం)—యేసు

  • సిద్ధపడి ఉన్న బుద్ధిగల కన్యలు (2వ వచనం)—అంతం వరకు తమ నియామకాన్ని నమ్మకంగా చేయడానికి సిద్ధపడి, జ్యోతుల్లా ప్రకాశించే అభిషిక్త క్రైస్తవులు (ఫిలి 2:15)

  • “పెళ్లికొడుకు వచ్చేశాడు” అనే కేక (6వ వచనం)—యేసు ప్రత్యక్షతకు రుజువు

  • బుద్ధిలేని కన్యలు (8వ వచనం)—పెళ్లికొడుకును కలవడానికి వెళ్లినప్పటికీ అప్రమత్తంగా ఉండడంలో, తమ యథార్థతను కాపాడుకోవడంలో విఫలమైన అభిషిక్త క్రైస్తవులు

  • బుద్ధిగల కన్యలు తమ దగ్గరున్న నూనెను ఇవ్వలేదు (9వ వచనం)—చివరి ముద్ర పొందిన తర్వాత యథార్థంగా ఉన్న అభిషిక్త క్రైస్తవులు, తమ యథార్థతను కాపాడుకోలేకపోయినవాళ్లకు సహాయం చేయలేరు

  • “పెళ్లికొడుకు వచ్చేశాడు” (10వ వచనం)—మహాశ్రమ చివర్లో తీర్పు ప్రకటించడానికి యేసు వస్తాడు

  • బుద్ధిగల కన్యలు పెళ్లికొడుకుతోపాటు పెళ్లి విందు కోసం లోపలికి వెళ్తారు, తలుపులు మూయబడ్డాయి (10వ వచనం)—యేసు తన నమ్మకమైన అభిషిక్తుల్ని పరలోకానికి సమకూరుస్తాడు. అయితే, నమ్మకంగాలేని వాళ్లు తమ పరలోక బహుమానాన్ని పోగొట్టుకుంటారు

అభిషిక్తుల్లో చాలామంది యథార్థతను కోల్పోతారని, వాళ్ల స్థానంలో వేరేవాళ్లు వస్తారని ఈ ఉపమానం చెప్పడంలేదు. కానీ ప్రతి అభిషిక్తుడు సిద్ధపాటుతో అప్రమత్తంగా ఉండాలా లేక తప్పిపోయి తన యథార్థతను కోల్పోవాలా అని నిర్ణయించుకునే అవకాశం పూర్తిగా అతని చేతుల్లో ఉంటుందని ఆ ఉపమానం హెచ్చరిస్తుంది. అందుకే యేసు “సిద్ధంగా ఉండండి” అని నొక్కిచెప్పాడు. (మత్త 24:44) మనకు ఏ నిరీక్షణ ఉన్నా, మనమందరం నమ్మకంగా సేవ చేయడానికి మన మనసుని సిద్ధం చేసుకోవాలని, అప్రమత్తంగా ఉండాలని యేసు కోరుకుంటున్నాడు.

నేను అప్రమత్తంగా ఉన్నానని ఎలా చూపిస్తున్నాను?

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి