దేవుని వాక్యంలో ఉన్న సంపద | యిర్మీయా 35-38
ఎబెద్మెలెకు ధైర్యానికి, దయకు మంచి ఉదాహరణ
రాజైన సిద్కియా ఆస్థానంలో అధికారిగా ఉన్న ఎబెద్మెలెకు దైవిక లక్షణాలు చూపించాడు
ఎబెద్మెలెకు యిర్మీయా కోసం సిద్కియా రాజు దగ్గరకు వెళ్లి, లోతైన బురద గుంటలో నుండి యిర్మీయాను కాపాడి ధైర్యంతో, నిశ్చయతతో ప్రవర్తించాడు
యిర్మీయాను త్రాళ్లతో పైకి లాగుతున్నప్పుడు గీసుకుపోకుండా చంకల కింద పెట్టుకోవడానికి పాత పీలికలు, చింపిరి గుడ్డలను ఇచ్చి ఎబెద్మెలెకు దయను చూపించాడు