మన క్రైస్తవ జీవితం
నిష్క్రియులుగా ఉన్న క్రైస్తవుల్ని మీరు ప్రోత్సహించవచ్చు
ఏప్రిల్ 11, మంగళవారం, జ్ఞాపకార్థ ఆచరణకు చాలామంది నిష్క్రియులైన క్రైస్తవులు వస్తారు. వాళ్లు జీవం కోసం పరుగు పందెంలో పరిగెత్తడం మొదలుపెట్టారు కానీ రకరకాల కారణాల వల్ల వెనకపడ్డారు. వాటిలో కొన్ని కారణాలు యెహోవా దగ్గరకు తిరిగి రండి బ్రోషురులో ఉన్నాయి. (హెబ్రీ 12:1) యెహోవా వాళ్లను తన కుమారుని రక్తంతో కొన్నాడు కాబట్టి వాళ్లింకా యెహోవాకు అమూల్యమైనవాళ్లే. (అపొ 20:28; 1 పేతు 1:18, 19) వాళ్లు సంఘానికి తిరిగి రావడానికి మనమెలా సహాయం చేయవచ్చు?
ఒక గొర్రెల కాపరి మందనుండి తప్పిపోయిన గొర్రె కోసం జాగ్రత్తగా వెతికినట్లే, సంఘ పెద్దలు కూడా నిష్క్రియులుగా ఉన్న క్రైస్తవులను వెదికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. (లూకా 15:4-7) ఇది యెహోవాకున్న ప్రేమ, శ్రద్ధకు నిదర్శనం. (యిర్మీ 23:3, 4) పెద్దలు మాత్రమే కాదు, మనందరం కూడా అలాంటి వాళ్లను ప్రోత్సహించవచ్చు. వాళ్లమీద దయ చూపిస్తూ వాళ్లను అర్థం చేసుకోవడానికి మనం చేసే ప్రయత్నాలన్నిటిని చూసి యెహోవా సంతోషిస్తాడు. అలాంటి ప్రయత్నాల వల్ల మంచి ఫలితాలు కూడా వస్తాయి. (సామె 19:17; అపొ 20:35) కాబట్టి మీరు ఎవర్ని ప్రోత్సహించగలరో ఆలోచించి, ఆలస్యం చేయకుండా ఆ పని చేయండి.
నిష్క్రియుల్ని ప్రోత్సహించండి వీడియో చూసిన తర్వాత ఈ ప్రశ్నల్ని పరిశీలించండి:
అబీకి తెలియని ఒక యెహోవాసాక్షిని కలిసినప్పుడు ఆమె ఏమి చేసింది?
మనం నిష్క్రియులుగా ఉన్న ఎవరికైనా సహాయం చేయాలనుకున్నప్పుడు ముందు పెద్దలతో ఎందుకు మాట్లాడాలి?
అబీ రెండవసారి లారాను కలవడానికి ఎలా సిద్ధపడింది?
లారాను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అబీ పట్టుదల, ఓపిక, ప్రేమ ఎలా చూపించింది?
లూకా 15:8-10లో యేసు చెప్పిన ఉపమానం నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు?
లారాకు సహాయం చేయడానికి అందరూ కలిసి చేసిన ప్రయత్నాల వల్ల ఎలాంటి మంచి ఫలితాలు వచ్చాయి?