కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • wp20 No. 3 పేజీ 13
  • అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలి

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలి
  • కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
  • ఉపశీర్షికలు
  • ఇలాంటి మరితర సమాచారం
  • పవిత్ర లేఖనాలు ఏం చెప్తున్నాయి?
  • అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడమంటే ఏంటి?
  • మీరు యెహోవా సహాయాన్ని అంగీకరిస్తారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2004
  • జాతివివక్షకు పరిష్కారం ఏమిటి?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మీరు ‘దేవునియెడల ధనవంతులై’ ఉన్నారా?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—2007
  • మేకలకు గొఱ్ఱెలకు ఏ భవిష్యత్తు ఉంది?
    కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది—1995
మరిన్ని
కావలికోట యెహోవా రాజ్యాన్ని ప్రకటిస్తోంది (సార్వజనిక)—2020
wp20 No. 3 పేజీ 13
ఒక వ్యక్తి మ్యాపు ఉపయోగించి మరో వ్యక్తికి దారి చూపిస్తున్నాడు.

వయసు, దేశం, మతం లాంటివి పట్టించుకోకుండా ఇతరులకు మీరు సహాయం చేస్తారా?

అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయాలి

ప్రపంచంలో చాలామందికి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఇంకొంతమందికి జీవితం మీద ఎలాంటి ఆశ లేదు. అలాంటివాళ్లకు సహాయం చేస్తే దేవుని అనుగ్రహంతో పాటు, ఆయనిచ్చే దీవెనలు పొందుతాం.

పవిత్ర లేఖనాలు ఏం చెప్తున్నాయి?

“పేదవాళ్ల మీద దయ చూపించేవాడు యెహోవాకు అప్పు ఇస్తున్నాడు, అతను చేసినదానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు.”—సామెతలు 19:17.

అవసరంలో ఉన్నవాళ్లకు సహాయం చేయడమంటే ఏంటి?

దొంగల చేతిలో దెబ్బలు తిని కొనప్రాణంతో ఉన్న వ్యక్తి గురించి యేసు ఒక కథ చెప్పాడు. (లూకా 10:29-37) ఆ దారిలో వెళ్తున్న ఒకతను, ఒంటినిండా దెబ్బలతో ఉన్న ఆ వ్యక్తిని చూసి జాలిపడి గాయాలకు కట్టు కట్టాడు. ఆసక్తికరమైన విషయమేంటంటే, సహాయం చేసిన ఆ వ్యక్తి వేరే జాతికి చెందినవాడు.

అతను గాయాలకు కట్టు కట్టడం, డబ్బులిచ్చి సత్రంలో చేర్చడం మాత్రమే కాదు; ఆ వ్యక్తిని ఓదార్చి అతని బాధను తగ్గించాడు.

ఈ కథ మనకేం నేర్పిస్తుంది? అవసరంలో ఉన్నవాళ్లకు మనం చేయగలిగిన సహాయం చేయాలని యేసు ఈ కథ ద్వారా నేర్పిస్తున్నాడు. (సామెతలు 14:31) దేవుడు త్వరలో పేదరికం, బాధలు లేకుండా చేస్తాడని పవిత్ర లేఖనాలు చెప్తున్నాయి. అయితే దేవుడు దాన్ని ఎప్పుడు చేస్తాడు, ఎలా చేస్తాడు అనే సందేహం మీకు రావచ్చు. మిమ్మల్ని ప్రేమించే మీ సృష్టికర్త మీకు ఎలాంటి దీవెనలు ఇవ్వబోతున్నాడో తర్వాతి ఆర్టికల్‌లో తెలుసుకోండి.

“దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు”!

గాంబియా నుండి వలస వెళ్లిన ఒకవ్యక్తి అనుభవం

“నేను యూరప్‌కి ఖాళీ చేతులతో వెళ్లాను; ఉద్యోగం గానీ, డబ్బు గానీ, ఇల్లు గానీ ఏమీ లేవు. ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో పవిత్ర లేఖనాల నుండి నేర్చుకున్నాను. కష్టపడి పనిచేయాలని, ఇతరుల దగ్గర చేయి చాచే బదులు నేనే ఇంకొకరికి సహాయం చేయాలని తెలుసుకున్నాను. దేవుడు నన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు, ఆయన నన్ను దీవించాడు.”

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి