మన క్రైస్తవ జీవితం
హింసలు ఎదుర్కొంటున్న సహోదరుల కోసం ప్రార్థించండి
మనం చేసే పరిచర్యకు ఇబ్బంది కలిగేలా సాతాను మనపై హింసను తీసుకొస్తాడని బైబిలు ప్రవచించింది. (యోహా 15:20; ప్రక 12:17) వేరే దేశాల్లో హింసలు ఎదుర్కొంటున్న మన తోటి క్రైస్తవులకు మనమెలా సహాయం చేయవచ్చు? వాళ్లకోసం ప్రార్థన చేయవచ్చు. “నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలముగలదై యుండును.”—యాకో 5:16.
ఏమని ప్రార్థన చేయాలి? మన సహోదరసహోదరీలకు ధైర్యాన్ని ఇవ్వమని, వాళ్లు భయపడకుండా ఉండడానికి సహాయం చేయమని యెహోవాకు ప్రార్థన చేయవచ్చు. (యెష 41:10-13) “మనము . . . నెమ్మదిగాను సుఖముగాను బ్రదుకు నిమిత్తము” మనం చేసే పరిచర్యకు సానుకూలంగా ఉండాలని అధికారుల కొరకు కూడా ప్రార్థించవచ్చు.—1 తిమో 2:1, 2.
పౌలును, పేతురును హింసించినప్పుడు మొదటి శతాబ్దంలో క్రైస్తవులు వాళ్ల పేర్లతో వాళ్లకోసం ప్రార్థించారు. (అపొ 12:5; రోమా 15:30, 31) ఇప్పుడు హింసలు ఎదుర్కొంటున్న వాళ్లందరి పేర్లు మనకు తెలీకపోయినా వాళ్ల సంఘం, దేశం లేదా ప్రాంతం పేరు ఉపయోగించి ప్రార్థన చేయవచ్చు.