దేవుని వాక్యంలో ఉన్న సంపద | యెషయా 34-37
హిజ్కియా చూపించిన విశ్వాసానికి ప్రతిఫలం వచ్చింది
అష్షూరు రాజైన సన్హెరీబు యెరూషలేమును లొంగిపోమని అదేశించడానికి రబ్షాకేను పంపిస్తాడు. అష్షూరీయులు రకరకాలుగా వాదిస్తూ యూదులు యుద్ధం చేయకుండానే లొంగిపోయేలా చేయాలనుకుంటారు.
ఒంటరిగా చేయడం. ఐగుప్తు నీకు సహాయం చేయలేదు.—యెష 36:6
సందేహం. యెహోవా మీ తరఫున యుద్ధం చేయడు ఎందుకంటే ఆయన మీ మీద కోపంగా ఉన్నాడు.—యెష 36:7, 10
భయం. శక్తివంతమైన అష్షూరు సైన్యం ముందు మీరు నిలబడలేరు. —యెష 36:8, 9
శోధన. అష్షూరుకు లొంగిపోతే మీ జీవితాలు బాగుపడతాయి. —యెష 36:16, 17
హిజ్కియా యెహోవాపై స్థిరమైన విశ్వాసాన్ని చూపించాడు
ముట్టడి సమయంలో పట్టణాన్ని కాపాడడం కోసం ఆయనకు చేతనైన ఏర్పాట్లన్నీ చేస్తాడు
విడుదల కోసం యెహోవాకు ప్రార్థన చేస్తాడు, ప్రజలకు యెహోవాపై ఉన్న నమ్మకాన్ని బలపరుస్తాడు
యెహోవా తన దూతను పంపించి 1,85,000 అష్షూరు సైనికులను ఒక్క రాత్రిలోనే హతమార్చినప్పుడు హిజ్కియా విశ్వాసానికి ప్రతిఫలం వచ్చింది