మన క్రైస్తవ జీవితం
బైబిల్లో మనం ఏమి నేర్చుకోవచ్చు?(What Can the Bible Teach Us?)-పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి
మనం నేర్చుకోవచ్చు అనే పుస్తకంa బైబిలు బోధిస్తోంది పుస్తకం లాంటిదే. ఈ రెండు బోధనా పరికరాలు ఒకే బైబిలు సత్యాలను, ఒకే వరుసలో వివరిస్తాయి. కానీ మనం నేర్చుకోవచ్చు పుస్తకంలో త్వరగా అర్థమయ్యే పదాలు, తర్కం ఉన్నాయి. బైబిలు బోధిస్తోంది పుస్తకం అర్థం చేసుకోవడం కష్టంగా ఉన్నవాళ్ల కోసం దీన్ని తయారుచేశారు. దీనిలో అనుబంధానికి బదులు అధస్సూచిలు ఉన్నాయి. అవి కొన్ని అంశాలను, పదాలను సులువుగా అర్థం చేసుకునేందుకు సహాయం చేస్తాయి. ఈ పుస్తక అధ్యాయాల్లో ఉపోద్ఘాత ప్రశ్నలు, పునఃసమీక్ష బాక్సు ఉండవు. వాటికి బదులు, ప్రతీ అధ్యాయంలో ఉన్న సమాచారానికి సంబంధించిన బైబిలు బోధల సారాంశం ఉంటుంది. ఆ నెలలో ఇవ్వాల్సిన సాహిత్యంలో లేకపోయినా బైబిలు బోధిస్తోంది పుస్తకంలానే మనం నేర్చుకోవచ్చు పుస్తకాన్ని ఎప్పుడైనా ఇవ్వవచ్చు. మనం నేర్చుకోవచ్చు పుస్తకంలో ఉన్న ప్రత్యేకమైన అంశాలను బైబిలు స్టడీ చేస్తున్నప్పుడు ఎలా ఉపయోగించవచ్చు?
సారాంశం: చాలామందికి బైబిలు బోధిస్తోంది పుస్తకం నుండి స్టడీ చేస్తున్నప్పుడు ఎప్పుడూ ఉపయోగించే పద్ధతినే అంటే పేరాలు చదివించి తర్వాత ప్రశ్నలు అడగడం చక్కగా పనిచేస్తుంది. కానీ ఒకవేళ, విద్యార్థికి భాష సరిగ్గా రాకపోయినా లేదా సరిగ్గా చదవలేకపోయినా, మనం నేర్చుకోవచ్చు పుస్తకం ఉపయోగించి స్టడీ చేయవచ్చు. స్టడీని మీరు అధ్యాయాల్లో ఉన్న సారాంశం ఆధారంగా చేయవచ్చు. తర్వాత అధ్యాయంలో ఉన్న సమాచారం అంతటిని సొంతగా చదువుకోమని విద్యార్థిని ప్రోత్సహించవచ్చు. ప్రతీ స్టడీలో ఒక్కో బైబిలు సత్యాన్ని చెప్పడానికి బహుశా 15 నిమిషాలు ఉపయోగించవచ్చు. అధ్యాయంలో ఉన్న వివరాలు అన్నీ సారాంశంలో ఉండవు కాబట్టి విద్యార్థి అవసరాలను మనసులో పెట్టుకుని బోధకుడు బాగా ప్రిపేర్ అవ్వాలి. మీరు అధ్యాయం మొత్తాన్ని స్టడీ చేస్తే, సారాంశాన్ని పునఃసమీక్షగా ఉపయోగించవచ్చు.
అధస్సూచిలు: అధ్యాయంలో ఉన్న వరుసలోనే అధస్సూచిల్లో పదాలు, అంశాలు ఉంటాయి. స్టడీ చేస్తున్నప్పుడు మనం నేర్చుకోవచ్చు పుస్తకంలో ఉన్న అధస్సూచిలు చర్చించాలో లేదో మీరు నిర్ణయించుకోవచ్చు.
a ఈ ప్రచురణ ఇప్పుడు తెలుగులో లేదు.