దేవుడు ప్రేమతో ఇచ్చే దీవెనల్ని మీరు శాశ్వతకాలం ఆనందించవచ్చు
యుద్ధాలు, గొడవలు, దౌర్జన్యం లేని ప్రపంచాన్ని చూడాలని ఆశపడుతున్నారా?
జబ్బులు, బాధలు, మరణం లేకపోతే బావుంటుందని అనుకుంటున్నారా?
చింతలు, ఆందోళనలు లేని రోజుల కోసం ఎదురుచూస్తున్నారా?
తుఫానులు, వరదలు రాని ప్రాంతంలో జీవించాలని కోరుకుంటున్నారా?
మనుషులు శాశ్వతకాలంపాటు ప్రశాంతకరమైన, సంతోషకరమైన పరిస్థితుల మధ్య జీవించేలా చేస్తానని ప్రేమగల దేవుడు, ఈ అందమైన భూమిని చేసిన సృష్టికర్త మాటిచ్చాడు. ఇలాంటివి కలలోనే జరుగుతాయని అనుకోకండి.
తర్వాతి ఆర్టికల్స్‌లో ఈ కింది విషయాల్ని పరిశీలించండి:
మన సృష్టికర్తకు మనుషుల మీద ఉన్న ప్రేమ
దేవుని వాక్యంలో మనకోసం రాయబడిన విషయాలు
దేవుడు మాటిచ్చిన దీవెనల గురించి ఆయన ప్రవక్తలు చెప్పిన విషయాలు
ఇప్పుడు అలాగే భవిష్యత్తులో సంతోషంగా జీవించడానికి మనం చేయాల్సిన పనులు
ముందుగా, మన సృష్టికర్తకు మన మీద ఎంత ప్రేమ ఉందో పరిశీలిద్దాం.