మన క్రైస్తవ జీవితం
ప్రీచింగ్‌లో పిల్లలతో మాట్లాడవచ్చా?
ఇంటింటి పరిచర్యలో మీరు ఇంటివాళ్లను పిలవగానే పిల్లలు బయటకు వస్తే వాళ్ల తల్లిదండ్రులతో మాట్లాడడానికి వచ్చాము అని చెప్పాలి. అప్పుడు ఇంట్లో పెద్దవాళ్లకు గౌరవం ఇచ్చిన వాళ్లమౌతాం. (సామె 6:20) పిల్లవాడు లోపలికి రమ్మంటే మనం వెళ్లకూడదు. తల్లిదండ్రులు ఇంట్లో లేకపోతే వేరే సమయంలో వెళ్లాలి.
పిల్లలు కొంచెం పెద్దవాళ్లైనా అంటే 15 నుండి 19 సంవత్సరాల వయసు ఉన్నా తల్లిదండ్రులతో మాట్లాడతామని చెప్పాలి. వాళ్లు ఇంట్లో లేకపోతే, మన పుస్తకాలు చదవడానికి ఇంట్లోవాళ్లు ఒప్పుకుంటారో లేదో పిల్లల్ని కనుక్కోండి. ఒప్పుకుంటే మన పత్రికలు, పుస్తకాలు ఇవ్వొచ్చు లేదా jw.org వెబ్‌సైట్ గురించి చెప్పవచ్చు.
ఆసక్తి చూపించిన పిల్లవాడిని మళ్లీ కలుసుకోవడానికి వెళ్లినప్పుడు తల్లిదండ్రులతో మాట్లాడతామని అడగండి. అప్పుడు మనం ఎందుకు వచ్చామో తల్లిదండ్రులకు వివరించవచ్చు. బైబిలులో కుటుంబాలకు అవసరమైన, పాటించదగిన సలహాలను వాళ్లకు చూపించవచ్చు. (కీర్త 119:86, 138) తల్లిదండ్రులకు గౌరవాన్ని, విలువను ఇచ్చినప్పుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తాం. ఆ కుటుంబంతో సువార్త గురించి చెప్పడానికి వేరే అవకాశాలు కూడా దొరుకుతాయి.—1 పేతు 2:12.