దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎస్తేరు 6-10
ఎస్తేరు యెహోవా కోసం, ఆయన ప్రజల కోసం నిస్వార్థంగా పోరాడింది
ముద్రిత ప్రతి
ఎస్తేరు ధైర్యంగా తన గురించి ఆలోచించుకోకుండా, యెహోవా పక్షాన, ఆయన ప్రజల పక్షాన మాట్లాడింది
ఎస్తేరుకి మొర్దెకైకి ఏం కాలేదు. కానీ యూదులందరినీ చంపాలని హామాను తెచ్చిన రాజాజ్ఞ మాత్రం రాజ్యంలో అన్ని చోట్లకి వెళ్లిపోయింది
ఎస్తేరు మళ్లీ తన ప్రాణాన్ని లెక్కచేయకుండా, రాజు ఆహ్వానం లేకుండానే ఆయన దగ్గరకు వెళ్లింది. తన ప్రజల కోసం ఏడ్చి ఆ ఆజ్ఞను వాళ్ల మీదికి రాకుండా ఆపేయమని రాజును అడిగింది
కానీ రాజు పేరు మీద జారీ అయిన ఆజ్ఞలు ఆపడానికి వీలు కాదు. అందుకే రాజు ఒక కొత్త ఆజ్ఞ జారీ చేయమని ఎస్తేరుకు, మొర్దకైకి అధికారం ఇచ్చాడు
యెహోవా ఆయన ప్రజలకు గొప్ప విజయాన్ని ఇచ్చాడు
రెండవ ఆజ్ఞ జారీ అయ్యింది, దాని ద్వారా యూదులు వాళ్లని వాళ్లు కాపాడుకునే హక్కు వచ్చింది
గుర్రాలపై అంచెవాండ్రు రాజ్యం అంతటా వెళ్లారు, యూదులు యుద్ధానికి సిద్ధపడతారు
దేవుడు యూదుల పక్షాన ఉన్నాడని తెలుసుకుని చాలామంది యూదులుగా మారారు