మన క్రైస్తవ జీవితం
కొత్తవాళ్లకు స్వాగతం చెప్దాం
మార్చి 23న జరిగే క్రీస్తు జ్ఞాపకార్థానికి దాదాపు 120 లక్షల కన్నా ఎక్కువమంది కొత్తవాళ్లు వస్తారని అనుకుంటున్నాం. యెహోవా ఇచ్చిన బహుమానమైన విమోచన క్రయధనం గురించి, దానివల్ల భవిష్యత్తులో మనుషులందరికీ వచ్చే ఆశీర్వాదాల గురించి ప్రసంగీకుడు చెప్పినప్పుడు వచ్చినవాళ్లు గొప్ప సాక్ష్యాన్ని పొందుతారు. (యెష 11:6-9; 35:5, 6; 65:21-23; యోహా 3:16) ఈ ప్రత్యేక సమయంలో సాక్ష్యం ఇచ్చేది కేవలం ప్రసంగీకుడే కాదు. మనం కూడా వచ్చిన కొత్తవాళ్లను సాదరంగా ఆహ్వానిస్తూ సాక్ష్యం ఇవ్వవచ్చు. (రోమా 15:7) మనమేమి చేయవచ్చో కొన్ని సలహాలు ఇప్పుడు చూద్దాం.
రాగానే వెళ్లి సీట్ చూసుకుని కార్యక్రమం ప్రారంభమయ్యే వరకు అక్కడే కూర్చుని ఉండే బదులు, మీరే వెళ్లి కొత్తవాళ్లని, నిష్క్రియులుగా ఉన్నవాళ్లని మంచి చిరునవ్వుతో, ఆప్యాయంగా పలకరించండి
మీరు పిలిచిన వాళ్లను ప్రత్యేకంగా చూసుకుంటూనే, ప్రచార కార్యక్రమం ద్వారా ఆహ్వానం పొందిన మిగతా వాళ్లను కూడా పలకరించండి. కొత్తవాళ్లను మీతోపాటు కూర్చోపెట్టుకోండి. మీ బైబిలును, పాటల పుస్తకాన్ని వాళ్లకు చూపించండి
ప్రసంగం తర్వాత, వాళ్లు అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి సమయం తీసుకోండి. మీ తర్వాత వేరే సంఘం అక్కడ ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటుంటే మీరు అక్కడి నుండి త్వరగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత వాళ్లను కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి. మీ దగ్గర వాళ్ల అడ్రస్ లేదా ఫోన్ నెంబరు లేకపోతే మీరిలా అడగవచ్చు: “మీకు ఈ కార్యక్రమం ఎలా అనిపించిందో తెలుసుకోవాలనుకుంటున్నాను. మిమ్మల్ని మళ్లీ కలవడం ఎలా?”