దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎస్తేరు 1-5
ఎస్తేరు దేవుని ప్రజల పక్షాన నిలిచింది
దేవుని ప్రజల పక్షాన నిలిచి ఎస్తేరు ఎంతో విశ్వాసాన్ని, ధైర్యాన్ని చూపించింది
ఆజ్ఞ లేకుండా రాజు దగ్గరకు వెళ్తే మరణమే. 30 రోజులుగా రాజు ఎస్తేరును పిలవలేదు.
అహష్వేరోషు రాజుకు (క్సెరెక్సెస్ I అయ్యుండవచ్చు) కోపం చాలా ఎక్కువ. ఒకసారి ఒక మనిషిని రెండు ముక్కలు చేయించి ఒక హెచ్చరికగా అందరికీ చూపించి భయపెట్టాడు. తనకు లోబడలేదని వష్తిని రాణిగా ఉంచకుండా తీసేశాడు
ఆమె ఒక యూదురాలని, రాజు నమ్ముతున్న సలహాదారుడు పచ్చి మోసగాడని చెప్పాల్సివచ్చింది