దేవుని వాక్యంలో ఉన్న సంపద | ఎజ్రా 1-5
యెహోవా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు
ముద్రిత ప్రతి
యెరూషలేము ఆలయంలో సత్యారాధనను తిరిగి స్థాపిస్తానని యెహోవా మాట ఇచ్చాడు. కానీ బబులోనులో బందీగా ఉన్నవాళ్లు తిరిగి వచ్చాక, ఆలయాన్ని మళ్లీ కట్టడానికి చాలా అడ్డంకులు వచ్చాయి, కట్టడం ఆపేయమని రాజు నుండి ఒక ఆజ్ఞ కూడా వచ్చింది. ఇంక ఆ పని పూర్తి అవ్వదని చాలా మంది భయపడ్డారు.
క్రీ. పూ. 537కి దగ్గర్లో
ఆలయాన్ని తిరిగి కట్టమని కోరెషు రాజు ఆజ్ఞ ఇచ్చాడు
-
ఏడవ నెల
బలిపీఠం కడతారు; బలులు అర్పిస్తారు
-
క్రీ. పూ. 536
పునాది వేశారు
-
క్రీ. పూ. 522
రాజైన అర్తహషస్త కట్టడం ఆపించేస్తాడు
-
క్రీ. పూ. 520
జెకర్యా, హగ్గయి తిరిగి కట్టడం మొదలు పెట్టమని ప్రజలకు చెప్తారు
-
క్రీ. పూ. 515
ఆలయం కట్టడం పూర్తైంది