ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? సెప్టెంబరు, అక్టోబరు: కావలికోట, తేజరిల్లు! పత్రికలు. నవంబరు, డిసెంబరు: మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు? (T-16), శాంతియుతమైన నూతనలోకంలో జీవితము (T-15), కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి (T-21), లేదా బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!(T-27), అనే పాత కరపత్రాలను ఉపయోగించండి. అవి లేకపోతే చనిపోయినవాళ్లు మళ్లీ బతుకుతారా?, కుటుంబాలు సంతోషంగా ఉండాలంటే ఏం అవసరం?, జీవితంలోని ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు ఎక్కడ దొరుకుతాయి?, బాధలు లేని కాలం ఎప్పటికైనా వస్తుందా? అనే కరపత్రాలను ఉపయోగించి బైబిలు అధ్యయనాలు మొదలుపెట్టండి. దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్‌ను లేదా బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకంతో బైబిలు అధ్యయనం చేయండి.
◼ 2016 జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగం మార్చి 28తో మొదలయ్యే వారంలో ఉంటుంది. ఆ ప్రసంగం అంశం తర్వాత తెలియచేస్తాం. ఆ వారంలో ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం లేక సమావేశం ఉంటే ఆ ప్రసంగం తర్వాతి వారంలో ఇవ్వాలి. మార్చి 28కి ముందు ఏ సంఘంలోనూ ఆ ప్రసంగం ఇవ్వకూడదు.
◼ మన రాజ్య పరిచర్య నవంబరు 2014, 5వ పేజీ, 22-24 పేరాల్లో ఉన్న నిర్దేశాల ప్రకారం క్రమ పయినీర్ల సేవ అంతటినీ సంఘ సేవా కమిటీ పరిశీలించాలి.
◼ బహిష్కరించబడి లేదా సహవాసం మానుకుని తిరిగి సంఘంలోకి రావడానికి ఇష్టపడుతున్న వాళ్లను తిరిగి సంఘంలోకి చేర్చుకోవడం గురించి కావలికోట ఏప్రిల్ 15, 1991, 21-23 పేజీల్లో ఇచ్చిన సూచనలను పాటించమని పెద్దలకు గుర్తుచేస్తున్నాం.