ఏప్రిల్ 20తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 20తో మొదలయ్యే వారం
పాట 32, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 15వ కథ (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 23-25 (8 నిమి.)
నం. 1:1 సమూయేలు 23:13-23 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: భవిష్యత్తు గురించి బైబిలు ఏమి వాగ్దానం చేస్తోంది?—igw 16వ పేజీ, 1-3 పేరాలు (5 నిమి.)
నం. 3: బారూకు—అంశం: నిస్వార్థంగా యెహోవాను సేవించండి—యిర్మీ 32:9-16; 36:1-32; 43:4-7; 45:1-5 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: “మీరు సమయమును పోనియ్యక సద్వినియోగము చేసికొనుచు,” జ్ఞానులవలె నడుచుకోండి.—ఎఫె. 5:15, 16.
15 నిమి: “కార్ట్ ఉపయోగిస్తూ ఎలా సాక్ష్యం ఇవ్వాలి?” చర్చ. ఇలా ప్రదర్శన చేయించండి: ఇద్దరు ప్రచారకులు కార్ట్ లేదా టేబుల్ దగ్గర ఉంటారు. ఒక ప్రచారకుడు, రోడ్డు మీద వెళ్తున్న ఒకర్ని చూసి చిన్న నవ్వు నవ్వుతాడు. తోటి ప్రచారకుడు మరొకరిని చూసి నవ్వుతాడు. ఈ వ్యక్తి వాళ్ల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రచారకుడు ఒక ప్రశ్న అడిగి ఉత్సాహంగా సంభాషణ మొదలుపెడతాడు. వేరే పద్ధతిలో సాక్ష్యమిస్తున్నప్పుడు కూడా ఈ విధానాన్ని ఎలా పాటించవచ్చు?
15 నిమి: జ్ఞాపకార్థ ఆచారానికి వచ్చిన వాళ్లను మళ్లీ కలవండి. ప్రసంగం. ఎంతమంది వచ్చారో చెప్పి, అనుభవాలు ఉంటే పంచుకోండి. జ్ఞాపకార్థానికి వచ్చిన వాళ్లను మళ్లీ కలవమని అందర్నీ ప్రోత్సహించండి. అలాగే ఒక బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యాన్ని పెట్టుకోమని చెప్పండి. జ్ఞాపకార్థానికి వచ్చినా, సంఘ కూటాలకు క్రమంగా రానివాళ్లను మళ్లీ కలుస్తున్నప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకం ఉపయోగించి అధ్యయనం ప్రారంభించడం మీద మనసుపెట్టండి. దీనికి సంబంధించి ఒక ప్రదర్శన చేయించండి.
పాట 28, ప్రార్థన