మార్చి 9తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 9తో మొదలయ్యే వారం
పాట 15, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
my 7వ కథ (25 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 సమూయేలు 1-4 (8 నిమి.)
నం. 1: 1 సమూయేలు 2:30-36 (3 నిమి. లేదా తక్కువ)
నం. 2: మెస్సీయ గురించి బైబిలు ముందే ఏమి చెప్పింది?—igw 10వ పేజీ (5 నిమి.)
నం. 3: ఆసా—అంశం: స్వచ్ఛారాధన పట్ల ఆసక్తి చూపించండి—2 దిన 14:1-15; 15:1-15 (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’—తీతు 3:1, 2.
10 నిమి: ‘ప్రతి సత్కార్యానికీ సిద్ధపడి ఉండండి.’ నెల ముఖ్యాంశం ఆధారంగా ప్రసంగం. సామెతలు 21:5; తీతు 3:1, 2; 1 పేతురు 3:15, 16 చదివి, చర్చించండి. చక్కని సిద్ధపాటు వల్ల క్రైస్తవులు ఎలా ప్రయోజనం పొందుతారో వివరించండి. ఈ నెల సేవా కూటాల్లోని కొన్ని భాగాలను సమీక్షించండి, నెల ముఖ్యాంశానికి అవి ఎలా ముడిపడి ఉన్నాయో చర్చించండి.
10 నిమి: దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పర్యవేక్షకుణ్ణి ఇంటర్వ్యూ చేయండి. మీ నియామకంలో ఏమేం చేయాల్సి ఉంటుంది? ప్రతీవారం పాఠశాల నిర్వహించడానికి మీరెలా సిద్ధపడతారు? విద్యార్థులు తమ నియామకాలకు చక్కగా ఎందుకు సిద్ధపడాలి? కూటానికి రాకముందే, సమాచారాన్ని ముందుగా చదవడం వల్ల ప్రేక్షకులు ఎలాంటి ప్రయోజనాలు పొందుతారు?
10 నిమి: “జ్ఞాపకార్థ ఆచారానికి సిద్ధపడుతున్నారా?” చర్చ. మార్చి 2013 మన రాజ్య పరిచర్య 2వ పేజీలోని సమాచారాన్ని క్లుప్తంగా పరిశీలించండి. జ్ఞాపకార్థ ఆచారానికి వచ్చిన వ్యక్తిని ప్రచారకుడు ఆహ్వానిస్తున్నట్లు ఒక ప్రదర్శన చేయించండి.
పాట 8, ప్రార్థన