డిసెంబరు 22తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 22తో మొదలయ్యే వారం
పాట 31, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
jl 5-7 పాఠాలు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యెహోషువ 9-11 (10 నిమి.)
నం. 1: యెహోషువ 9:16-27 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: అందరూ ఒకే దేవుణ్ణి ఆరాధించడం లేదు—td 30డి (5 నిమి.)
నం. 3: యెహోవా తన నియమాలను ఇవ్వడం—my 35వ కథ (5 నిమి.)
సేవా కూటం:
ఈ నెల ముఖ్యాంశం: మనకు అప్పగించిన మంచి ధననిధి నుండి మంచి విషయాలను ఇద్దాం.—మత్త. 12:35ఎ.
30 నిమి: “2015 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల చక్కగా బోధించేందుకు సహాయం చేస్తుంది.” చర్చ. పాఠశాల పర్యవేక్షకుడు చేస్తాడు. అవసరమైతే కొన్ని పేరాలను చదివించవచ్చు. 1వ విద్యార్థి ప్రసంగం, బైబిలు ముఖ్యాంశాలకు కేటాయించిన సమయం, పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చే సలహాల విషయంలో వచ్చిన మార్పులను చెప్పండి. 7వ పేరా చదివి, చర్చించిన తర్వాత, ఒక పెద్ద తన కుటుంబ ఆరాధనలో భార్య, పిల్లవాడితో దేవుని వాక్యంలో ఏముందో తెలుసుకోండి 14వ పేజీలో ఉన్న సమాచారాన్ని చర్చిస్తున్నట్లు మంచి ప్రదర్శన చేయించండి. పాఠశాలలో దేవుడు మనకు ఇస్తున్న చక్కని శిక్షణను, పరిచర్య పాఠశాల పుస్తకాన్ని బాగా ఉపయోగించుకోమని అందరినీ ప్రోత్సహించండి.
పాట 11, ప్రార్థన