ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
అక్టోబరులో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“మనలో చాలామందిమి ఎప్పుడో ఒకప్పుడు తప్పకుండా దేవునికి ప్రార్థించివుంటాం. మన ప్రార్థనలను దేవుడు విలువైనవిగా చూస్తాడా లేక తప్పదన్నట్లు వింటాడా? మీకేమనిపిస్తుంది?” వాళ్లేమి చెప్తారో వినండి. “దీని గురించి నేను తెలుసుకున్న ఆసక్తికరమైన ఒక విషయం మీతో చెప్పవచ్చా?” ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, అక్టోబరు – డిసెంబరు కావలికోట చివరి పేజీ చూపించి, అక్కడున్న మొదటి ప్రశ్న కింది సమాచారాన్ని, అక్కడున్న లేఖనాల్లో కనీసం ఒకదాన్ని పరిశీలించండి. పత్రిక ఇచ్చి, మళ్లీ కలవడానికి ఏర్పాట్లు చేసుకోండి.
అక్టోబరు – డిసెంబరు
“మంచివాళ్లకు చెడు ఎందుకు జరుగుతుందో చాలామందికి అంతుబట్టదు. ఈ చెడు సంఘటనలన్నిటికీ కారణం ఎవరని మీకనిపిస్తుంది? [వాళ్లేమి చెప్తారో వినండి.] జరుగుతున్న చెడంతటికీ దేవుడు కారణమా కాదా? అనే దాని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో చూపించమంటారా? [ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, యాకోబు 1:13 చదవండి.] చెడు సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో, చెడును-బాధను దేవుడు ఎలా తీసివేస్తాడో ఈ పత్రిక వివరిస్తుంది.”