సెప్టెంబరు 8తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 8తో మొదలయ్యే వారం
పాట 31, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
bm 14వ పాఠం (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: సంఖ్యాకాండము 22-25 (10 నిమి.)
నం. 1: సంఖ్యాకాండము 22:36–23:10 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: భాషలలో మాట్లాడడం కేవలం తాత్కాలిక ఏర్పాటు—td 45డి (5 నిమి.)
నం. 3: ఒక చెడ్డ రాజు ఐగుప్తును పరిపాలించడం—my 27వ కథ (5 నిమి.)
సేవా కూటం:
10 నిమి: పరిచర్యలో మంచి మర్యాదలు చూపించండి. (2 కొరిం. 6:3) ఈ ప్రశ్నల ఆధారంగా చర్చ. (1) పరిచర్యలో ఉన్నప్పుడు మంచి మర్యాదలు చూపించడం ఎందుకు ప్రాముఖ్యం? (2) ఈ పరిస్థితుల్లో మంచి మర్యాదలు ఎలా చూపించవచ్చు: (ఎ) ప్రచారకులు క్షేత్రానికి వచ్చినప్పుడు (బి) ఒక ఇంటినుండి మరో ఇంటికి వెళ్తున్నప్పుడు లేదా ఇళ్లు దూరదూరంగా ఉన్నచోట బండి మీద వెళ్తున్నప్పుడు (సి) ఒక ఇంటిముందు నిలబడి ఉన్నప్పుడు (డి) తోటి ప్రచారకుడు సాక్ష్యమిస్తుంటే (ఇ) ఇంటివాళ్లు మాట్లాడుతుంటే (ఎఫ్) ఇంటివాళ్లు బిజీగా ఉంటే లేదా వాతావరణం బాలేకపోతే (జి) ఇంటివాళ్లు కఠినంగా మాట్లాడితే.
10 నిమి: అవసరం ఎక్కువగా ఉన్నచోట మీరు సేవ చేయగలరా? మన రాజ్య పరిచర్య జూలై 2001, 8వ పేజీలోని ఆర్టికల్ ఆధారంగా సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. ఇంకా ఎక్కువ సేవ చేయాలనే లక్ష్యమున్న లేదా ఇప్పటికే అలా చేస్తున్న పయినీరు ఉంటే ఇంటర్వ్యూ చేయండి.
10 నిమి: “పరిచర్యలో నైపుణ్యాలు మెరుగుపర్చుకుందాం—మళ్లీ కలుసుకోవడానికి ఏర్పాట్లు చేసుకోండి.” చర్చ. తనలోతాను మాట్లాడుకునే సన్నివేశం: ఇంటివాళ్లు పత్రిక తీసుకుంటే, తర్వాత కలవడానికి ఏ ప్రశ్న వేస్తే బావుంటుందో ప్రచారకుడు ముందే సిద్ధపడుతుంటాడు.
పాట 38, ప్రార్థన