దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2014 జూన్ 30తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
వినోదాన్ని, ఉల్లాస కార్యకలాపాలను ఎంచుకుంటున్నప్పుడు, నిర్గమకాండము 23:2లోని సూత్రాన్ని పాటించడం ఎందుకు ప్రాముఖ్యం? [మే 5, w11 7/15 10-11 పేజీలు, 3-7 పేరాలు]
యెహోవాకు బలులు అర్పించడానికి ముందు యాజకులు కాళ్లు, చేతులు కడుక్కోవాలనే ఆజ్ఞ ఎంత గంభీరమైనది? నేటి దేవుని సేవకులకు అది ఎలా ఒక బలమైన జ్ఞాపికగా ఉంది? (నిర్గ. 30:18-21) [మే 19, w96 7/1 9వ పేజీ, 9వ పేరా]
బంగారు దూడను చేసినందుకు అహరోనుకు ఎందుకు శిక్ష పడలేదు? (నిర్గ. 32:1-8, 25-35) [మే 19, w04 3/15 27వ పేజీ, 4వ పేరా]
కోర్ట్‌షిప్, వివాహం విషయంలో క్రైస్తవుల వైఖరికి, ఇతర దేవుళ్లను ఆరాధించేవాళ్లను వివాహం చేసుకోకూడదని ఇశ్రాయేలీయులకు దేవుడిచ్చిన ఆజ్ఞకు ఎలాంటి పోలిక ఉంది? (నిర్గ. 34:11-16) [మే 26, w11 12/15 10-11 పేజీలు, 10-15 పేరాలు]
బెసలేలు, అహోలీయాబుల ఉదాహరణ మనకెందుకు ప్రోత్సాహకరం? (నిర్గ. 35:30-35) [మే 26, w10 9/15 10వ పేజీ, 13వ పేరా]
ఇశ్రాయేలు ప్రధానయాజకుడు ధరించిన తలపాగా మీద ఉండే “సమర్పణ యొక్క పరిశుద్ధ సూచన” దేనికి జ్ఞాపికగా ఉండేది? సమర్పణ గురించి ఆ సూచన మనకు ఏమి చెబుతుంది? (నిర్గ. 39:30, NW) [జూన్ 2, w01 2/1 14వ పేజీ, 2-3 పేరాలు]
తోటి క్రైస్తవుడు గంభీరమైన పాపం చేశాడని తెలిసినప్పుడు ప్రతీ క్రైస్తవునికి ఏ బాధ్యత ఉంది? (లేవీ. 5:1) [జూన్ 9, w12 2/15 22వ పేజీ, 15-16 పేరాలు]
ఇశ్రాయేలు కాలంలో, సమాధాన బలుల ప్రాముఖ్యత ఏమిటి? అవి నేడు వేటికి సూచనగా ఉన్నాయి? (లేవీ. 7:31-33) [జూన్ 16, w12 1/15 19వ పేజీ, 11-12 పేరాలు]
అహరోను కుమారులైన నాదాబు, అబీహు చేసిన పాపంలో ఏమేమి ఇమిడి ఉండవచ్చు? ఆ వృత్తాంతం నుండి మనం ఏ పాఠాలు నేర్చుకోవచ్చు? (లేవీ. 10:1, 2, 9) [జూన్ 23, w04 5/15 22వ పేజీ, 7వ పేరా నుండి 23వ పేజీ, 1వ పేరా]
పిల్లలను కనడం స్త్రీని ఎందుకు ‘అపవిత్రురాలిని’ చేస్తుంది? (లేవీ. 12:2, 5, NW) [జూన్ 23, w04 5/15 23వ పేజీ, 3వ పేరా]