ప్రకటనలు
◼ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మే, జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ అందించండి: బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి. జూలై: దేవుడు చెబుతున్న మంచివార్త! బ్రోషుర్ గానీ ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు?