కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 4/14 పేజీలు 7-8
  • పరిపాలక సభ నుండి ఉత్తరం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • పరిపాలక సభ నుండి ఉత్తరం
  • మన రాజ్య పరిచర్య—2014
  • ఉపశీర్షికలు
  • ప్రియమైన మా తోటి ఇంటివారికి,
మన రాజ్య పరిచర్య—2014
km 4/14 పేజీలు 7-8

పరిపాలక సభ నుండి ఉత్తరం

ప్రియమైన మా తోటి ఇంటివారికి,

ఎంతో ప్రాముఖ్యమైన ఈ సంవత్సరం ఆరంభంలో మీకు ఉత్తరం రాయడం మాకు చాలా ఆనందంగా ఉంది! 2014 చివరికల్లా, మన ప్రియమైన రాజు యేసుక్రీస్తు తన శత్రువుల మధ్య పరిపాలించడం మొదలుపెట్టి వందేళ్లు పూర్తౌతుంది.—కీర్త. 110:1, 2.

ఈ సేవా సంవత్సరం మొదట్లో, వాచ్‌ టవర్‌ బైబిల్‌ అండ్‌ ట్రాక్ట్‌ సొసైటీ ఆఫ్‌ పెన్సిల్వేనియా జరుపుకున్న వార్షిక కూటంలో న్యూ వరల్డ్‌ బైబిల్‌ ట్రాన్స్‌లేషన్‌ కమిటీ మానవులకు అందుబాటులో ఉన్న అత్యుత్తమ అనువాద బైబిలు రివైజ్డ్‌ ఇంగ్లీష్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. నూతనలోక అనువాదము (ఇంగ్లీషు) బైబిలును రూపొందించడానికి, యెహోవా తన ఆత్మవల్ల జన్మించిన కుమారులను ఉపయోగించుకున్నాడు. (రోమా. 8:15, 16) ఇది ప్రత్యేక అనువాదమని చెప్పడానికి ఆ ఒక్క విషయం చాలు, కాదంటారా?

పరిపాలక సభ ఆధ్వర్యంలోని రైటింగ్‌ కమిటీ ఎన్నో ఏళ్లుగా బైబిలు అనువాదానికి ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. నేడు నూతనలోక అనువాదము పూర్తి బైబిలు లేదా అందులోని కొంత భాగం 121 భాషల్లో అందుబాటులో ఉంది. మీ దగ్గరున్న బైబిలును మీరు ఎంత విలువైనదిగా ఎంచుతున్నారో యెహోవాకు చూపించమని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం. ప్రతీరోజు దాన్ని చదవండి, ధ్యానించండి. అలాచేస్తే, దాని గ్రంథకర్త యెహోవా దేవునికి మీరు మరింత దగ్గరౌతారు.—యాకో. 4:8.

మన ప్రియ సహోదరసహోదరీలు ఎదుర్కొంటున్న పరీక్షల గురించి విన్నప్పుడు మా హృదయం చలించిపోతుంది. వాటివల్ల, కొన్నిసార్లు వాళ్లు తమ తోటి సహోదరులతో కలిసి సంతోషించలేకపోవచ్చు. ఈమధ్యే, ఆసియాలో నివసిస్తున్న ఒక కుటుంబంలో తల్లికి పక్షవాతం రావడంతో కుటుంబమంతా విషాదం అలుముకుంది. పరిస్థితి అంతుపట్టక వైద్య నిపుణులు కూడా ఏమీ చేయలేకపోయారు. ఎంత విచారకరం! ఇప్పుడు భర్త పగలూ రాత్రీ భార్య పక్కనే ఉంటూ ఆమె బాగోగులు చూసుకుంటున్నాడు. వాళ్ల కొడుకు, ఇద్దరు కూతుళ్లు తల్లిదండ్రులకు చక్కగా సహకరిస్తూ మంచి క్రైస్తవుల్లా నడుచుకుంటున్నారు. ఈ చక్కని కుటుంబం, అలాగే “నానా విధములైన శోధనలు” ఎదుర్కొంటూ నమ్మకంగా కొనసాగుతున్న మీరందరూ విశ్వాస పరీక్షలు సహించడం వల్ల కలిగే ఆనందాన్ని చవిచూడవచ్చు. (యాకో. 1:2-4) పరీక్షలు సహించినందుకు అభిషిక్తులు, వేరే గొర్రెలు సంతోషిస్తారని యెహోవా అభయమిస్తున్నాడు. ఎందుకంటే, నిత్యజీవాన్ని ఇచ్చి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు!—యాకో. 1:12.

గత ఏడాది జ్ఞాపకార్థ ఆచరణకు 1,92,41,252 మంది హాజరయ్యారు. దేవుని ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన ఆ కూటానికి అంతమంది హాజరై యెహోవాను, యేసుక్రీస్తును గౌరవించడం ఎంత ప్రోత్సాహకరమైన విషయమో కదా! జ్ఞాపకార్థ ఆచరణ కాలంలోని మార్చి, ఏప్రిల్‌ నెలల్లో లక్షలమంది సహాయ పయినీరు సేవ చేసి యెహోవాను బిగ్గరగా స్తుతించారు. అది మనల్ని ఎంతగా పురికొల్పుతుందో కదా! మార్చి, ఏప్రిల్‌ నెలల్లోనే కాకుండా ప్రాంతీయ పర్యవేక్షకుని సందర్శనం ఏ నెలలో జరిగినా ఆ నెల సహాయ పయినీరు సేవ చేసేవాళ్లు, పయినీర్లతో ఆయన నిర్వహించే కూటాన్ని పూర్తిగా ఆనందించవచ్చని తెలుసుకొని మీరు సంతోషించలేదా? ఆధ్యాత్మికంగా తెలివైనవాళ్లు ప్రకటనాపనిలో, సంఘ పనుల్లో చురుగ్గా ఉండడం ఎంత ప్రాముఖ్యమో గుర్తిస్తారు. వాటిలో నిమగ్నమైతే ‘స్థిరంగా, కదలని వాళ్లుగా’ ఉంటాం; మన విశ్వాసాన్ని నీరుగార్చి మనల్ని పక్కదారి పట్టించడానికి సాతాను చేసే ప్రయత్నాల్ని తిప్పికొడతాం.—1 కొరిం. 15:58.

గడిచిన సేవా సంవత్సరంలో 2,77,344 మంది యెహోవాకు తాము చేసుకున్న సమర్పణకు గుర్తుగా నీటి బాప్తిస్మం తీసుకుని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ సహోదరులతో కలిసి జీవమార్గంలో నడుస్తున్నారని తెలుసుకోవడం మనకు ఎంత పురికొల్పునిస్తుందో కదా! (మత్త. 7:13, 14) ‘విశ్వాసంలో స్థిరపడడానికి’ వాళ్లకు మన సహాయం అవసరం. (కొలొ. 2:6, 7) అంతం వరకు సహించేలా ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఉండండి. (మత్త. 24:13) ‘ధైర్యం చెడినవాళ్లను ధైర్యపరచండి, బలహీనులకు ఊతనియ్యండి, అందరియెడల దీర్ఘశాంతం గలవారై ఉండండి.’ (1 థెస్స. 5:14) చివరిగా, మనలో ప్రతీ ఒక్కరం “నీ రాజ్యము వచ్చుగాక” అని ‘ఎడతెగక ప్రార్థిస్తూ’ ఉందాం.—1 థెస్స. 5:15; మత్త. 6:9, 10.

యెహోవాను ప్రేమిస్తున్న మీలో ప్రతి ఒక్కర్నీ మేము ప్రేమిస్తున్నామని మర్చిపోకండి!

మీ సహోదరులు,

యెహోవాసాక్షుల పరిపాలక సభ

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి