ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జ్ఞాపకార్థ ఆచరణ ఆహ్వానపత్రాలు అందించే ప్రచార కార్యక్రమం కోసం:
“చాలా ప్రాముఖ్యమైన ఒక కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. అది, యేసుక్రీస్తు మరణ జ్ఞాపకార్థ ఆచరణ. అసలు దాన్ని ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలని మీకు అనిపించవచ్చు. [వాళ్లేమి చెప్తారో వినండి. వాళ్లకు ఆసక్తి ఉందని మీకనిపిస్తే] దీన్ని ఆచరించడానికి, ఏప్రిల్ 14న ప్రపంచవ్యాప్తంగా లక్షలమంది సమకూడుతున్నారు. యేసు మరణం వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఆ రోజు ఇచ్చే ప్రసంగంలో తెలుసుకోవచ్చు. మనకు దగ్గర్లో అది ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందో ఈ ఆహ్వానపత్రంలో ఉంది.”
కావలికోట ఏప్రిల్– జూన్
“మనందర్నీ కలచివేసే ఒక విషయం గురించి మేము క్లుప్తంగా మాట్లాడుతున్నాం. ప్రాణ స్నేహితుడు గానీ బంధువు గానీ చనిపోయినప్పుడు మనకు చెప్పలేనంత బాధ కలుగుతుంది కదా? [వాళ్లేమి చెప్తారో వినండి.] ఎంతోమందికి ఓదార్పునిచ్చిన ఒక వాగ్దానాన్ని మీకు చూపించవచ్చా? [వాళ్లు ఒప్పుకుంటే, యెషయా 25:8 చదవండి.] మరణాన్ని తీసేసి, చనిపోయిన మన ప్రియమైనవాళ్లను మళ్లీ బ్రతికిస్తానని దేవుడు బైబిల్లో చేసిన సంతోషకరమైన వాగ్దానం గురించి ఈ పత్రిక వివరిస్తుంది.”