ప్రకటనలు
ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మార్చి, ఏప్రిల్: కావలికోట పత్రిక. ఆసక్తి ఉన్నవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మే, జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం గానీ ఈ కరపత్రాల్లో ఒకటి గానీ అందించండి: బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, బాధలు ఎప్పటికైనా అంతమవుతాయా?, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి.
ఈ ఏడాది జ్ఞాపకార్థ ఆచరణ, ఏప్రిల్ 14 సోమవారం రోజు జరుగుతుంది. సాధారణంగా మీ సంఘానికి సోమవారం రోజు కూటాలు జరుగుతుంటే, (రాజ్యమందిరం అందుబాటులో ఉంటే) వాటిని ఆ వారంలోని మరో రోజుకు మార్చుకోవాలి. ఒకవేళ ఆ వారం సేవాకూటాన్ని రద్దు చేయాల్సివస్తే, ప్రత్యేకించి మీ సంఘానికి ఉపయోగపడే భాగాలను ఆ నెలలోని మరో సేవాకూటంలో నిర్వహించేలా సంఘ పెద్దల సభ సమన్వయకర్త ఏర్పాటుచేయవచ్చు.
2014 మార్చి – 2014 ఆగస్టు మధ్యకాలంలో ప్రాంతీయ పర్యవేక్షకుడు ఇచ్చే బహిరంగ ప్రసంగ అంశం: “ప్రపంచవ్యాప్త విపత్తు నుండి రక్షణ.”
2014 జూన్ 9తో మొదలయ్యే వారం నుండి సంఘ బైబిలు అధ్యయనంలో బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషుర్‌ను పరిశీలిస్తాం. ఈ బ్రోషుర్లు సరిపడేన్ని లేని సంఘాలు, తర్వాతి సాహిత్య రిక్వెస్టులో వాటిని తెప్పించుకోవచ్చు.