ఫిబ్రవరి 24తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 24తో మొదలయ్యే వారం
పాట 4, ప్రార్థన
సంఘ బైబిలు అధ్యయనం:
cl 26వ అధ్యా., 18-23 పేరాలు, 269వ పేజీలోని బాక్సు (30 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: ఆదికాండము 32-35 (10 నిమి.)
దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
సేవా కూటం:
8 నిమి: “ప్రచార కార్యక్రమం మార్చి 22న మొదలౌతుంది.” సేవా పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. హాజరైన వాళ్లందరికీ తలా ఒక ఆహ్వానపత్రం ఇచ్చి, దానిలోని సమాచారాన్ని చర్చించండి. దీనికి సంబంధించిన నిర్దేశాలతో పెద్దలకు పంపిన ఉత్తరంలో నుండి మీ సంఘానికి అన్వయించే అంశాలను, క్షేత్రాన్ని పూర్తిచేయడానికి స్థానికంగా చేస్తున్న ఏర్పాట్లను పేర్కొనండి.
22 నిమి: “మీ భాష మాట్లాడే వాళ్ల కోసం ఎలా వెదకాలి?” ప్రశ్నాజవాబులు. సమాచారాన్ని స్థానికంగా ఎలా అన్వయించుకోవచ్చో నొక్కిచెప్పండి. మీ సంఘం ఆధ్వర్యంలో ఒక భాషా గుంపు ఉంటే లేదా మీ సంఘం భాష మాట్లాడేవాళ్ల కోసం మీరు వెదుకుతుంటే, ఆ పని చేస్తున్నప్పుడు ఏమి మాట్లాడాలో తెలిపే ఒక ప్రదర్శనను 5వ పేరా పరిశీలిస్తున్నప్పుడు చేయించండి.
పాట 10, ప్రార్థన