సెప్టెంబరు 16తో మొదలయ్యే వారపు పట్టిక
సెప్టెంబరు 16తో మొదలయ్యే వారం
పాట 26, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 18వ అధ్యా., 11-19 పేరాలు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 కొరింథీయులు 1–7 (10 నిమి.)
నం. 1: రెండవ కొరింథీయులు 1:15–2:11 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: మొదటి పురుషుడు, స్త్రీ—my 3వ కథ (5 నిమి.)
నం. 3: యెహోవా నామాన్ని ఆశ్రయించాలంటే ఏమి చేయాలి?—జెఫ. 3:12 (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: యౌవనస్థులారా—మీ జీవితంలో మీరేమి చేస్తారు?—2వ భాగం. జీవితంలో మీరేమి చేస్తారు? కరపత్రంలోని 10వ పేరా నుండి చివరి పేరా వరకున్న సమాచారం ఆధారంగా ఇచ్చే ప్రసంగం. యౌవనంలో పూర్తికాల సేవ మొదలుపెట్టిన ఒకరిని క్లుప్తంగా ఇంటర్వ్యూ చేయండి. వాళ్లు ఎలా ఆ నిర్ణయం తీసుకోగలిగారు? దానివల్ల ఏ ఆశీర్వాదాల్ని పొందారు?
10 నిమి: మీరు ఒంటరిగా పరిచర్య చేస్తున్నప్పుడు . . . చర్చ. (1) మనం ఒంటరిగా పరిచర్య చేస్తున్నప్పుడు, మన సంతోషం నీరుగారకుండా ఉండాలంటే ఏమి చేయాలి? (2) ఒంటరిగా పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? (3) సాధారణంగా ఎవరూ పరిచర్య చేయని రోజుల్లో మనం చేస్తుంటే, మనతో కలిసి పరిచర్యకు రమ్మని సంఘంలోని ఇతరుల్ని మనమెలా ప్రోత్సహించవచ్చు? (4) మన భద్రతకు భంగం కలగకుండా ఉన్న ఏ సమయంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా అప్పుడప్పుడు ఒంటరిగా పరిచర్య చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి?
10 నిమి: “పిల్లలారా—మీ ఆధ్యాత్మిక లక్ష్యాలు ఏమిటి?” ప్రశ్నాజవాబులు. 3వ పేరా చర్చించిన తర్వాత, చిన్న వయసులో పూర్తికాల సేవ మొదలుపెట్టిన ఓ సహోదరుణ్ణి లేదా సహోదరిని ఇంటర్వ్యూ చేయండి.
పాట 16, ప్రార్థన