ఆగస్టు 12తో మొదలయ్యే వారపు పట్టిక
ఆగస్టు 12తో మొదలయ్యే వారం
పాట 53, ప్రార్థన
□ సంఘ బైబిలు అధ్యయనం:
cl 16వ అధ్యా., 16-22 పేరాలు, 167వ పేజీలోని బాక్సు (30 నిమి.)
□ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: రోమీయులు 5-8 (10 నిమి.)
నం. 1: రోమీయులు 6:21–7:12 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: భూమి మళ్లీ ఒక పరదైసులా మారుతుంది —bm 30వ పేజీ (5 నిమి.)
నం. 3: ఆధ్యాత్మిక విషయాల కన్నా వస్తు సంబంధ విషయాలకు ప్రాధాన్యతను ఇవ్వడం ఎందుకు వినాశనానికి దారితీస్తుంది?—మత్త. 6:33; 1 తిమో. 6:10 (5 నిమి.)
□ సేవా కూటం:
10 నిమి: “దేవుని వాక్యం ఉపదేశించడానికి ప్రయోజనకరం.” ప్రశ్నాజవాబులు. ప్రాంతీయ సమావేశ తేదీలు తెలిస్తే చెప్పండి.
10 నిమి: పరిచర్యలో సంక్షిప్త ప్రతి ఎలా ఉపయోగపడుతుంది? పరిచర్య పాఠశాల పుస్తకంలోని 166వ పేజీ, చివరి పేరా నుండి 168వ పేజీ, 1వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా చర్చ. ఈ నెలలో అందించాల్సిన ప్రచురణను ఉపయోగిస్తూ, ఒక ప్రచారకుడు/రాలు తనలో తాను మాట్లాడుకునే ఒక ప్రదర్శన చేయించండి. పరిచర్యకు వెళ్లేముందు కొంత సమయం తీసుకుని, ప్రచురణ ఎలా అందించాలో సిద్ధపడుతూ మనసులో ఒక సంక్షిప్త ప్రతి తయారు చేసుకుంటున్నట్లు చూపించండి.
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. అపొస్తలుల కార్యములు 8:26-31 చదివించండి. ఈ వృత్తాంతం మన పరిచర్యకు ఎలా సహాయపడుతుందో పరిశీలించండి.
పాట 29, ప్రార్థన