కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 7/13 పేజీ 7
  • ప్రశ్నాభాగం

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రశ్నాభాగం
  • మన రాజ్య పరిచర్య—2013
  • ఇలాంటి మరితర సమాచారం
  • బాప్తిస్మం తీసుకోబోయే వాళ్లతో చేసే ముగింపు చర్చ
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • ప్రశ్నా భాగము
    మన రాజ్య పరిచర్య—1990
  • మంచివార్త ప్రచారకులు
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
  • అనుబంధం
    యెహోవా ఇష్టం చేస్తున్న సంస్థ
మరిన్ని
మన రాజ్య పరిచర్య—2013
km 7/13 పేజీ 7

ప్రశ్నాభాగం

◼ బాప్తిస్మం తీసుకొనని ఒక ప్రచారకుడు బాప్తిస్మం పొందాలంటే, ఆయన ఎంతమేర సంఘ కూటాలకు హాజరవ్వాలి, పరిచర్యలో పాల్గొనాలి?

ఒక వ్యక్తి తీసుకొనే అత్యంత ప్రాముఖ్యమైన నిర్ణయాల్లో బాప్తిస్మం పొందడం ఒకటి. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిస్మం పొందడానికి అర్హుడవ్వాలంటే ఆయనకు దేవుడు తన నుండి కోరే విషయాలపై కొంత అవగాహన ఉండాలి. దానికితోడు, దేవుడు కోరే విధంగా జీవిస్తున్నానని తన క్రియల్లో చూపించాలి.

క్రైస్తవులకు సమాజముగా కూడుట మానకూడదనే ఆజ్ఞ ఉంది కాబట్టి, బాప్తిస్మం తీసుకోని ప్రచారకుడు తాను కూటాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నానని చూపించాలి. (హెబ్రీ. 10:24, 25) ఆయన కూటాల్లో వ్యాఖ్యానాలు కూడా చేస్తాడు. అదే విధంగా, ఆయన దైవ పరిపాలనా పరిచర్య పాఠశాలలో కూడా భాగం వహిస్తాడు, అయితే ఖచ్చితంగా దానిలో పాల్గొనాలనే నియమమేమీ లేదు.

సువార్తను ప్రకటించి, శిష్యుల్ని చేసే బాధ్యత క్రైస్తవుల పై ఉంది కాబట్టి, బాప్తిస్మం తీసుకొనని ప్రచారకుడు ఆ విషయం మనస్సులో ఉంచుకొని బాప్తిస్మానికి ముందే క్రమం తప్పకుండా పరిచర్యలో పాల్గొంటూ ఉండాలి. (మత్త. 24:14; 28:19, 20) బాప్తిస్మం తీసుకొనే ముందు ఆయన అలా ఎన్ని నెలలు పరిచర్య చేయాలి? ప్రతినెలా క్రమంగా, ఉత్సాహంగా పరిచర్యలో పాల్గొనాలనే స్థిరనిశ్చయం తనకుందని చూపించేందుకు కావాల్సినంత సమయం ఆయనకు ఇవ్వాలి. (కీర్త. 78:37) అయితే ఆయన బాప్తిస్మానికి అర్హుడవ్వడానికి మరీ ఎక్కువ సమయం పట్టాల్సిన అవసరంలేదు, అది కొన్ని నెలలైనా సరిపోతుంది. మరి ఆయన పరిచర్యలో ఎంత సమయం గడపాలి? ఖచ్చితంగా ఇంత సమయం చేయాలనే నియమమేమీ లేదు. పెద్దలు ప్రతీ ప్రచారకుని పరిస్థితిని అర్థంచేసుకుని వాళ్లతో సహేతుకంగా వ్యవహరించాలి.—లూకా 21:1-4.

పెద్దలు, (లేదా పెద్దలు తక్కువగా ఉండే సంఘాల్లో పరిచర్య సేవకులు) బాప్తిస్మం తీసుకోవడానికి ఇష్టపడుతున్న అభ్యర్థుల్ని కలిసేటప్పుడు ప్రతీ వ్యక్తికీ విభిన్న వ్యక్తిత్వం ఉంటుందని గుర్తుంచుకొని, ఆ వ్యక్తి బాప్తిస్మానికి అవసరమైన అర్హతలు సాధించాడో లేదో సరైన విధంగా నిర్ణయించాలి. ఒక యెహోవాసాక్షి అవ్వాలనే కోరిక ఆయనకు నిజంగా ఉండాలనీ, అలాగే యెహోవా సంస్థతో సహవసించడం, పరిచర్యలో పాల్గొనడం గొప్ప గౌరవంగా ఆయన భావించాలనీ సంఘ పెద్దలు కోరుకుంటారు. అయితే ఆ వ్యక్తి ఆధ్యాత్మికంగా ఇంకా పరిణతి సాధించాల్సి ఉంటుందని, బాప్తిస్మం తీసుకున్న అనుభవజ్ఞులైన ప్రచారకులలో ఉండే నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికి సమయం పడుతుందని పెద్దలు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ వ్యక్తి బాప్తిస్మానికి అర్హత సాధించలేదని పెద్దలకు అనిపిస్తే, ఆయనకు లేఖనాధారిత కారణాల్ని వివరించి, ఆధ్యాత్మికంగా సహాయం చేయాలి.

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి