దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2013 జూన్ 24తో మొదలయ్యే వారంలో జరిగే దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం. ప్రతీ ప్రశ్న చివర్లో, దాన్ని చర్చించబోయే తేదీ ఉంది. మీరు ప్రతీ వారం పాఠశాలకు సిద్ధపడేటప్పుడు దాని గురించి కూడా పరిశోధన చేయవచ్చు.
1. ఏ దేవాలయం ‘నలువదియారు సంవత్సరాల్లో కట్టబడింది’? (యోహా. 2:20) [మే 6, w08 4/15 30వ పేజీ, 6వ పేరా]
2. ఒకరు ‘తనలో తానే జీవము కలిగి ఉండడం’ అంటే ఏమిటి? (యోహా. 5:26; 6:53) [మే 13, w08 4/15 31వ పేజీ, 1వ పేరా]
3. యేసు, అపరిపూర్ణ మానవులకు తన తండ్రి గురించి ఎలా బయల్పర్చాడో ఉదాహరించండి. (యోహా. 8:28) [మే 20, w11 10/1 7వ పేజీ, 3వ పేరా]
4. లాజరు చనిపోయినప్పుడు యేసు ‘కన్నీళ్లు విడిచాడు.’ దాన్నిబట్టి మనకేమి తెలుస్తుంది? (యోహా. 11:35) [మే 20, w12 4/15 5వ పేజీ, 10వ పేరా]
5. యేసు తన నమ్మకమైన అనుచరుల కోసం పరలోకంలో “స్థలము” ఎలా ‘సిద్ధపరుస్తాడు’? (యోహా. 14:2) [మే 27, w08 4/15 32వ పేజీ, 4వ పేరా]
6. పరిశుద్ధాత్మ మనకు ఎలా నడిపింపునిస్తుంది? (యోహా. 14:26) [మే 27, w11 12/15 14వ పేజీ, 9వ పేరా]
7. తనను ముట్టుకోవద్దని మగ్దలేనే మరియతో యేసు ఎందుకు చెప్పాడు? (యోహా. 20:17) [జూన్ 3, w08 4/15 32వ పేజీ, 6వ పేరా]
8. అపొస్తలుల కార్యములు 2:44-47; 4:34, 35 ప్రకారం, క్రైస్తవులు ఎలాంటి స్వభావాన్ని చూపించాలి? [జూన్ 10, w08 5/15 30వ పేజీ, 5వ పేరా]
9. అపొస్తలుల కార్యములు 7:59లో స్తెఫను యేసుకు ప్రార్థించాడా? [జూన్ 17, w08 5/15 31వ పేజీ, 2వ పేరా]
10. అపొస్తలుల కార్యములు 9:28-30 నుండి మనమేమి నేర్చుకోవచ్చు? [జూన్ 24, w08 5/15 31వ పేజీ, 6వ పేరా]