జూన్ 24తో మొదలయ్యే వారపు పట్టిక
జూన్ 24తో మొదలయ్యే వారం
పాట 8, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 14వ అధ్యా., 1-12 (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: అపొస్తలుల కార్యములు 8-10 (10 నిమి.)
వపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష (20 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: “ఒకే అంశం గురించి మాట్లాడండి.” ప్రసంగం. 4వ పేజీలోని సూచనలను ఉపయోగిస్తూ, జూలై నెలలో మొదటి శనివారం బైబిలు అధ్యయనం ఎలా మొదలుపెట్టవచ్చో చివర్లో ఒక ప్రదర్శనలో చూపించండి.
10 నిమి: మన ప్రయాసం వ్యర్థం కాదు. (1 కొరిం. 15:58; హెబ్రీ. 6:10) చర్చ. ఎన్నో సంవత్సరాలుగా చురుగ్గా సేవ చేస్తున్న ప్రచారకులను ముందుగా ఏర్పాటు చేసుకొని, తొలినాళ్లలో సాక్ష్యపు పని ఎలా జరిగేదో చెప్పమనండి. అప్పట్లో సంఘంతో ఎంతమంది సహవసించేవాళ్లు? సంఘానికి ఎంత క్షేత్రం ఉండేది? రాజ్య సందేశానికి ప్రజలు ఎలా స్పందించేవాళ్లు? ఎలాంటి వ్యతిరేకత ఎదుర్కొన్నారు? గడిచిన సంవత్సరాల్లో స్థానికంగా రాజ్య పని ఎలా వృద్ధి అయ్యింది?
10 నిమి: జూలై, ఆగస్టు నెలల్లో ఏమి ఇవ్వాలి? చర్చ. ఆ నెలల్లో అందించాల్సిన బ్రోషుర్లలోని అంశాలను క్లుప్తంగా పరిశీలించండి. వాటిలో రెండు బ్రోషుర్లను ఎలా అందించవచ్చో ప్రదర్శనల్లో చూపించండి. ఒకదానిలో మంచివార్త బ్రోషురును ఎలా అందించవచ్చో చూపించాలి, దానికోసం 4వ పేజీలోని సలహాలను, లేదా 2013 మార్చి మన రాజ్య పరిచర్యలో వచ్చిన “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” శీర్షికలోని సలహాలు ఉపయోగించండి.
పాట 54, ప్రార్థన