ప్రవక్తల్ని ఆదర్శంగా తీసుకోండి—యోనా
1. యోనా ఎలాంటి చక్కని లక్షణాల్ని చూపించాడు?
1 యోనా ప్రవక్త ఎలాంటి వ్యక్తని మీరు అనుకుంటున్నారు? ఆయన పిరికివాడని, కఠినుడని కొంతమంది అనుకుంటారు. కానీ నిజానికి, ఆయన వినయం, ధైర్యం, స్వయంత్యాగ స్ఫూర్తి చూపించాడు. యోనా చూపించిన చక్కని లక్షణాల్ని మనమెలా అనుకరించవచ్చు?—యాకో. 5:10.
2. యోనాలా మనమెలా వినయం చూపించవచ్చు?
2 వినయం: దేవుడు యోనాను నీనెవెకు వెళ్లమంటే ఆయన మాత్రం దానికి సరిగ్గా వ్యతిరేక దిశలో ఉన్న తర్షీషుకు పారిపోయాడు. ఇది ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ కాదు, ఎందుకంటే అష్షూరీయులు ఎంతో క్రూరులు, అంతేకాక నీనెవె ‘నరహత్య చేసిన పట్టణంగా’ పేరుగాంచింది. (నహూ. 3:1-3) అయినాసరే, యెహోవా యోనాను సరిదిద్ది, నీనెవెకు వెళ్లమని మళ్లీ చెప్పినప్పుడు యోనా వినయంగా లోబడ్డాడు. (సామె. 24:32; యోనా 3:1-3) అలా యోనా మొదట్లో దేవుని మాటకు లోబడకపోయినా చివరికి యెహోవా చిత్తాన్ని చేశాడు. (మత్త. 21:28-31) మనల్ని ఎవరైనా సరిదిద్దినప్పుడు లేదా మన ప్రాంతంలో ప్రకటించడం కష్టంగా ఉన్నప్పుడు మనం కూడా యోనాలాగే పట్టుదలగా సువార్త ప్రకటిస్తామా?
3. పరిచర్యలోని ఏయే విషయాల్లో ధైర్యం, స్వయంత్యాగం అవసరం?
3 ధైర్యం, స్వయంత్యాగం: తన తప్పుడు నిర్ణయం వల్ల నావికుల ప్రాణాలు ప్రమాదంలో పడ్డాయని అర్థం చేసుకున్నప్పుడు యోనా తన ప్రాణాన్నే త్యాగం చేయడానికి సిద్ధపడ్డాడు. (యోనా 1:3, 4, 12) ఆ తర్వాత నీనెవెలో యెహోవా తీర్పుల్ని ప్రకటించడానికి తగిన స్థలం కోసం చూస్తూ ఆయన నగరం నడిబొడ్డు వరకు నడిచాడు. ఇలాంటి పనులను ఒక పిరికిపంద కాదుగానీ ధైర్యవంతుడైన ప్రవక్త మాత్రమే చేయగలడు. (యోనా 3:3, 4) మన విషయమేంటి? వ్యతిరేకత ఉన్నా ధైర్యంగా సాక్ష్యమివ్వాలంటే మనకు దేవుడు ఇచ్చే ధైర్యం అవసరం. (అపొ. 4:29-31) పరిచర్యలో మన సమయం, వనరులు వెచ్చించాలంటే స్వయంత్యాగం అవసరం.—అపొ. 20:24.
4. యెహోవా ప్రవక్తలు చూపించిన చక్కని లక్షణాల గురించి ఎందుకు ధ్యానించాలి?
4 యెహోవా ప్రవక్తల గురించిన వృత్తాంతాలను చదివే ప్రతీసారి మీరే ఆ పరిస్థితుల్లో ఉన్నట్లు ఊహించుకుంటే ప్రయోజనం పొందుతారు. ఇలా ప్రశ్నించుకోండి: ‘నేనెలా స్పందించి ఉండేవాణ్ణి? ఆయన చూపించిన చక్కని లక్షణాల్ని నేనెలా అనుకరించవచ్చు?’ (హెబ్రీ. 6:11, 12) యెహోవాను నమ్మకంగా సేవించిన మరికొందరు ప్రవక్తల నుండి విలువైన పాఠాలను మన రాజ్య పరిచర్యలోని రాబోయే ఆర్టికల్స్‌లో పరిశీలిస్తాం.