మార్చి 11తో మొదలయ్యే వారపు పట్టిక
మార్చి 11తో మొదలయ్యే వారం
పాట 12, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 8వ అధ్యా., 17-24 పేరాలు, 86వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మార్కు 13-16 (10 నిమి.)
నం. 1: మార్కు 14:22-42 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: జ్ఞాపకార్థ ఆచరణ ప్రాముఖ్యత ఏమిటి? (5 నిమి.)
నం. 3: జ్ఞాపకార్థ చిహ్నాలు వేటిని సూచిస్తున్నాయి? (5 నిమి.)
❑ సేవా కూటం:
10 నిమి: మనం ఏమి నేర్చుకుంటాం? చర్చ. మత్తయి 10:7-10, లూకా 10:1-4 వచనాలు చదివించండి. అవి మన పరిచర్యలో ఎలా ఉపయోగపడతాయో పరిశీలించండి.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—1వ భాగం. మన రాజ్య పరిచర్య ఆగస్టు 2001, 8వ పేజీలో ఉన్న ఆర్టికల్ ఆధారంగా చర్చ. పూర్తికాల సేవ చేపట్టిన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. వాళ్లకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? వాటిని ఎలా తట్టుకున్నారు? వాళ్ల కుటుంబం లేదా సంఘం ఎలాంటి సహాయం అందించింది? ఎలాంటి ఆశీర్వాదాలు పొందారు?
10 నిమి: “సంతోష హృదయంతో జ్ఞాపకార్థ ఆచరణకు సిద్ధపడండి.” ప్రశ్నాజవాబులు. జ్ఞాపకార్థ ఆచరణ కోసం మీ సంఘంలో చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించండి. ప్రత్యేక ప్రచార కార్యక్రమం స్థానికంగా ఎలా సాగుతోందో చెప్పండి.
పాట 8, ప్రార్థన