ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఫిబ్రవరి: ఈ 32 పేజీల బ్రోషుర్లలో ఒకదాన్ని అందించండి: జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది, మీ ప్రియమైన వారెవరైనా చనిపోతే, యెహోవాసాక్షులు—వారు ఎవరు? వారి నమ్మకాలు ఏమిటి?, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు? ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసినప్పుడు, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మార్చి, ఏప్రిల్: కావలికోట పత్రిక. ఆసక్తి చూపించినవాళ్లను మళ్లీ కలిసినప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ ఆ వ్యక్తి పరిస్థితిని బట్టి, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఇచ్చి బైబిలు అధ్యయనం ప్రారంభించడానికి ప్రయత్నించండి. మే, జూన్: ఈ కరపత్రాల్లో ఒకదాన్ని అందించండి: కుటుంబ జీవితంలో సంతోషాన్ని అనుభవించండి, కృంగినవారికి ఓదార్పు, బాధలన్నీ త్వరలోనే అంతమవుతాయి!, మరణించిన మన ప్రియులకు ఏ నిరీక్షణ కలదు?, విధి మీ జీవితాన్ని నిర్ణయిస్తుందా?, శాంతియుతమైన నూతనలోకంలో జీవితము. ఆసక్తి చూపిస్తే, బైబిలు బోధిస్తోంది పుస్తకాన్ని గానీ, దేవుడు చెప్పేది వినండి లేదా దేవుడు చెప్పేది వినండి—నిత్యం జీవించండి బ్రోషుర్లలో ఒకదాన్ని గానీ ఉపయోగించి బైబిలు అధ్యయనం ఎలా చేస్తారో చూపించండి.
▪ జ్ఞాపకార్థ ఆచరణ కోసం ఒక కొత్త ప్రసంగ సంక్షిప్త ప్రతి తయారుచేశారు. 2013 మొదలుకొని జ్ఞాపకార్థ ఆచరణ ప్రసంగం ఇచ్చే సహోదరులందరూ దాన్నే ఉపయోగించాలి. ఈ సంవత్సరం ఇచ్చే ప్రసంగ శీర్షిక: “క్రీస్తు మీ కోసం చేసిన దానిపట్ల కృతజ్ఞత చూపించండి!”
▪ 2013వ సంవత్సరంలోని జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఇచ్చే ప్రత్యేక బహిరంగ ప్రసంగ ముఖ్యాంశం, “మరణమే ముగింపా?”