ఫిబ్రవరి 18తో మొదలయ్యే వారపు పట్టిక
ఫిబ్రవరి 18తో మొదలయ్యే వారం
పాట 4, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 7వ అధ్యా., 18-22 పేరాలు, 75వ పేజీలోని బాక్సు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: మార్కు 1-4 (10 నిమి.)
నం. 1: మార్కు 2:18–3:6 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: కష్టాలొచ్చినా యోబు దేవునికి నమ్మకంగా ఉన్నాడు—bm 9వ పేజీ (5 నిమి.)
నం. 3: మొదటి కొరింథీయులు 7:29-31లోని పౌలు సలహాను మనం ఎలా అర్థం చేసుకోవాలి? (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: ప్రకటనా పని చేయడానికి యెహోవా మనల్ని బలపరుస్తాడు. (ఫిలి. 4:13) అనారోగ్య సమస్యలున్నా పరిచర్యలో చురుగ్గా పాల్గొంటున్న ఇద్దరుముగ్గురు ప్రచారకుల్ని ఇంటర్వ్యూ చేయండి. వాళ్లకెలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? అప్పుడప్పుడూ నిరుత్సాహం కలిగినా, దాన్నుండి వీలైనంత త్వరగా బయటపడడానికి వాళ్లకేది సహాయం చేస్తోంది? సహోదరసహోదరీలు వాళ్లకెలా చేయూతనిచ్చారు? క్రమంగా పరిచర్యలో పాల్గొనడం వల్ల వాళ్లెలా ప్రయోజనం పొందారు?
15 నిమి: “ప్రత్యేక ప్రచార కార్యక్రమం మార్చి 1న మొదలౌతుంది.” ప్రశ్నాజవాబులు. ప్రేక్షకులందరికీ తలా ఒక ఆహ్వానపత్రాన్ని ఇచ్చి, అందులోని విషయాలను చర్చించండి. 2వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, మీ ప్రాంతంలో వీలైనంత ఎక్కువమందికి ఆహ్వానపత్రాలు పంచిపెట్టేందుకు చేసిన ఏర్పాట్ల గురించి చెప్పమని సేవా పర్యవేక్షకుణ్ణి ఆహ్వానించండి. 3వ పేరా పరిశీలిస్తున్నప్పుడు, 6వ పేజీలో ఉన్న, “ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు” అనే బాక్సులోని సూచనను ఉపయోగించి ఆహ్వానపత్రాన్ని ఎలా ఇవ్వవచ్చో ఒక ప్రదర్శనలో చూపించండి.
పాట 8, ప్రార్థన