ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జనవరిలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“సృష్టికర్తకు ఒక పేరు ఉందని మీరు అనుకుంటున్నారా? [వాళ్లు చెప్పేది వినండి.] దీనికి సంబంధించిన ఒక ఆసక్తికరమైన విషయం మీకు చూపించవచ్చా?” ఇంటివాళ్లు ఆసక్తి చూపిస్తే జనవరి - మార్చి కావలికోట సంచికను చేతికిచ్చి, చివరి పేజీలో ఉన్న ఆర్టికల్ని చూపించండి. మొదటి ప్రశ్న కింద ఉన్న సమాచారాన్ని, లేఖనాన్ని వాళ్లతో చర్చించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్నను చర్చించడానికి మళ్లీ కలుసుకునే ఏర్పాట్లు చేసుకోండి.
కావలికోట జనవరి - మార్చి
“ఈ రోజుల్లో ఎక్కడచూసినా లోకాంతం గురించే మాట్లాడుకుంటున్నారు. మీరేమంటారు, లోకాంతానికి మనం భయపడాలా? [వాళ్లు చెప్పేది వినండి.] దీని గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో మీకు చూపించవచ్చా? [వాళ్లు ఒప్పుకుంటే 1 యోహాను 2:17 చదవండి.] లోకాంతానికి సంబంధించి సాధారణంగా ప్రజలు అడిగే నాలుగు ప్రశ్నలకు ఈ పత్రిక జవాబిస్తుంది.”