డిసెంబరు 10తో మొదలయ్యే వారపు పట్టిక
డిసెంబరు 10తో మొదలయ్యే వారం
పాట 30, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
cl 4వ అధ్యా., 9-16 పేరాలు (30 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: జెఫన్యా 1–హగ్గయి 2 (10 నిమి.)
నం. 1: హగ్గయి 1:1-13 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: దేశభక్తికి సంబంధించిన కార్యక్రమాల విషయంలో ఒక క్రైస్తవుని వైఖరిని ఏ లేఖనాలు నిర్దేశిస్తాయి? (5 నిమి.)
నం. 3: మనం క్రీస్తు మనసును అర్థంచేసుకుంటే యెహోవా గురించి ఎక్కువ తెలుసుకుంటాం —మత్త. 11:27 (5 నిమి.)
❑ సేవా కూటం:
15 నిమి: 2013 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల. పాఠశాల పర్యవేక్షకుడు ఇచ్చే ప్రసంగం. 2013 దైవపరిపాలనా పరిచర్య పాఠశాల కార్యక్రమ సూచనలు ఉపయోగిస్తూ, మీ సంఘానికి అవసరమైన వాటిని చర్చించండి. తమ నియామకాలను శ్రద్ధగా నిర్వహించమని, బైబిలు ఉన్నతాంశాల్లో వ్యాఖ్యానించమని, పరిచర్య పాఠశాల పుస్తకం నుండి ప్రతీవారం నేర్చుకునే సలహాలను పాటించమని అందరినీ ప్రోత్సహించండి.
15 నిమి: “అందరితో సమాధానంగా ఉండండి.” ప్రశ్నాజవాబులు. రెండు భాగాల క్లుప్త ప్రదర్శన చేయించండి. కోప్పడిన గృహస్థునితో ఎలా ప్రవర్తించకూడదో మొదటి భాగంలో, ఎలా ప్రవర్తించాలో రెండవ భాగంలో చూపించండి.
పాట 39, ప్రార్థన