ప్రకటనాపని చేయడానికి పన్నెండు కారణాలు
మనమెందుకు సువార్త ప్రకటించి, బైబిలు అధ్యయనాలు నిర్వహిస్తాం? యథార్థ హృదయం గలవాళ్లను జీవమార్గంలోకి నడిపించడమే దానికి ముఖ్య కారణమా? (మత్త. 7:13, 14) ఇక్కడ ఇచ్చిన కారణాల్లో అది మొదటిది, అంతేగానీ అదే ముఖ్యమైన కారణం కాదు. మనం పరిచర్య ఎందుకు చేస్తున్నామో చూపించే పన్నెండు కారణాలు ఈ ఆర్టికల్లో ఇవ్వబడ్డాయి, వాటిలో ఏది అత్యంత ప్రాముఖ్యమైనదని మీరనుకుంటున్నారు?
1. ప్రజల ప్రాణాల్ని కాపాడడానికి సహాయం చేస్తుంది.—యోహా. 17:3.
2. దుష్టులను హెచ్చరించడానికి ఉపకరిస్తుంది.—యెహె. 3:18, 19.
3. బైబిలు ప్రవచన నెరవేర్పుకు తోడ్పడుతుంది.—మత్త. 24:14.
4. దేవుని నీతిని వెల్లడిచేస్తుంది. పశ్చాత్తాపపడడానికి అవకాశం ఇవ్వకుండా దుష్టులను నాశనం చేశాడని యెహోవాపై నిందవేయడానికి వీల్లేకుండా చేస్తుంది.—అపొ. 17:30, 31; 1 తిమో. 2:3, 4.
5. యేసు రక్తంతో కొనబడిన ప్రజలకు ఆధ్యాత్మిక సహాయం చేసే విషయంలో మనకున్న రుణాన్ని తీర్చుకొనే అవకాశం ఇస్తుంది.—రోమా. 1:14, 15.
6. రక్తాపరాధాన్ని తప్పించుకోవడానికి సహాయం చేస్తుంది.—అపొ. 20:26, 27.
7. మన సొంత రక్షణకు తప్పనిసరి.—యెహె. 3:19; రోమా. 10:9, 10.
8. పొరుగువారి మీద మనకున్న ప్రేమను వెల్లడిచేస్తుంది.—మత్త. 22:39.
9. యెహోవాకు, ఆయన కుమారునికి విధేయత చూపిస్తున్నామని తెలియజేస్తుంది.—మత్త. 28:19, 20.
10. మన ఆరాధనలో ఒక భాగం.—హెబ్రీ. 13:15.
11. దేవుని మీద మనకున్న ప్రేమను వ్యక్తం చేస్తుంది.—1 యోహా. 5:3.
12. యెహోవా నామం పరిశుద్ధపర్చబడడానికి దోహదపడుతుంది.—యెష. 43:10-12; మత్త. 6:9, 10.
అయితే పరిచర్య చేయడానికి ఇవి మాత్రమే కారణాలు కాదు. ఉదాహరణకు, ప్రకటనాపని చేయడం వల్ల మన విశ్వాసం బలపడుతుంది అంతేగాక, దేవుని జతపనివాళ్లమయ్యే గొప్ప అవకాశం మనకు దొరుకుతుంది. (1 కొరిం. 3:9) అయితే 12వ కారణమే మనం పరిచర్యలో పాల్గొనడానికి అత్యంత ముఖ్యమైన కారణం. ప్రజలు విన్నా వినకపోయినా పరిచర్య వల్ల యెహోవా నామం పరిశుద్ధపర్చబడుతుంది, తనను నిందిస్తున్న వ్యక్తికి జవాబిచ్చే అవకాశం యెహోవాకు దొరుకుతుంది. (సామె. 27:11) నిజంగానే, సువార్త ప్రకటించడంలో, బోధించడంలో కొనసాగడానికి మనకెన్నో మంచి కారణాలు ఉన్నాయి.—అపొ. 5:42.