ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు క్రమంగా హాజరుకాని వాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు, బైబిలు బోధిస్తోంది పుస్తకం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. ఒకవేళ గృహస్థుల దగ్గర అప్పటికే ఈ పుస్తకం ఉండి, బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి చర్చించే ఏ పాత పత్రికైనా, బ్రోషురైనా ఇవ్వవచ్చు. జూలై, ఆగస్టు: సంఘానికి అందుబాటులో ఉన్న 32 పేజీల ఏ బ్రోషుర్‌నైనా ఉపయోగించండి. పునర్దర్శనాలు చేస్తున్నప్పుడు బైబిలు బోధిస్తోంది పుస్తకాన్నిగానీ గృహస్థుని పరిస్థితులను బట్టి దేవుడు చెప్పేది వినండి, దేవుడు చెప్పేది వినండి నిత్యం జీవించండి బ్రోషుర్‌లలో ఒకదాన్నిగానీ ఇచ్చి బైబిలు అధ్యయనాన్ని ప్రారంభించడానికి ప్రయత్నించండి.
▪ మీరు వేరే దేశానికి వెళ్లినప్పుడు అక్కడ జరిగే జిల్లా సమావేశానికి హాజరుకావాలని అనుకుంటున్నట్లయితే, jw.org వెబ్‌సైట్‌లో Lookup టాబ్‌ను క్లిక్ చేసి Conventions అనే లింక్‌ను సెలెక్ట్ చేస్తే మీకు ఉపయోగపడే సమాచారం పొందవచ్చు.