ఏప్రిల్ 9తో మొదలయ్యే వారపు పట్టిక
ఏప్రిల్ 9తో మొదలయ్యే వారం
పాట 12, ప్రార్థన
❑ సంఘ బైబిలు అధ్యయనం:
gt 89, 90 అధ్యాయాలు (25 నిమి.)
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: యిర్మీయా 22-24 (10 నిమి.)
నం. 1: యిర్మీయా 23:15-23 (4 నిమి. లేదా తక్కువ)
నం. 2: కొత్త లోకంలో జీవితం ఎందుకు ఎప్పటికీ విసుగు పుట్టించదు? (5 నిమి.)
నం. 3: నేడు దైవపరిపాలనా సంస్థకు మద్దతునివ్వడం—wt 134-135 పేజీలు, 14-15 పేరాలు (5 నిమి.)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
15 నిమి: ‘మీ పరిచర్య విషయంలో జాగ్రత్తపడండి.’ కావలికోట జనవరి 15, 2008, 6-8 పేజీల్లోని 14-19 పేరాల ఆధారంగా ఇచ్చే ప్రసంగం. ఇప్పటివరకు సువార్త ప్రకటించని, సెలవు రోజుల్లో కొన్ని గుంపులు లేదా కుటుంబాలు వెళ్లి ప్రకటించినా సమస్యరాని ప్రాంతాలు మీ చుట్టుప్రక్కల ఉంటే పెద్దలు బ్రాంచి కార్యాలయం అనుమతితో అక్కడ ప్రకటనా పని చేయమని సంఘాన్ని ప్రోత్సహించవచ్చు. అయితే ఆ సాక్ష్యమిచ్చే పనిని పెద్దలు చక్కగా వ్యవస్థీకరించి పర్యవేక్షించాలి. ప్రచారకులు తమ ఏర్పాట్ల గురించి పెద్దలతో మాట్లాడవచ్చు. వేసవి కాలంలో స్కూలుకు సెలవులు ఇస్తారు కాబట్టి తమ ప్రాంతాన్ని పూర్తిచేయడానికి సహాయం అవసరమైన దగ్గర్లోని సంఘాలతో లేదా గుంపులతో పనిచేసేందుకు కూడా పెద్దలు ఏర్పాట్లు చేయవచ్చు. ఈ విషయంలో అవసరమైన వివరాలను మీ ప్రాంతీయ పర్యవేక్షకుణ్ణి అడిగి తెలుసుకోవచ్చు.
15 నిమి: “చక్కగా బోధించడానికి మూడు సలహాలు.” ప్రశ్నాజవాబులు. 2వ పేరా చర్చిస్తున్నప్పుడు, ఒక ప్రచారకుడు/రాలు గృహస్థునితో బైబిలు బోధిస్తోంది పుస్తకం 3వ పేజీలోని మొదటి పేరా పరిశీలిస్తున్నట్లు ఒక ప్రదర్శనలో చూపించండి. అక్కడ ఇచ్చిన యోబు 10:15లోని మాటలు చదివిన తర్వాత యోబు ఎవరనే దానిగురించి ఒకట్రెండు నిమిషాలు వివరిస్తున్నట్లు చూపించండి. ప్రదర్శన ముగిసిన తర్వాత, యోబు గురించి అతను చెప్పిన వివరాలు సరైనవే అయినా అది ఎందుకు మంచి బోధనా పద్ధతి కాదో ప్రేక్షకులను అడగండి.
పాట 10, ప్రార్థన