ప్రచురణలు ఇచ్చేటప్పుడు ఇలా చెప్పవచ్చు
జనవరిలో మొదటి శనివారం బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి:
“భూమ్మీద పరిస్థితులు బాగుపడాలని చాలామంది ఆశిస్తారు. అవి ఎలా బాగుపడతాయని మీరు అనుకుంటున్నారు? [వాళ్లేమి చెప్తారో వినండి.] దీనికి సమాధానం బైబిలు నుండి చదివి వినిపించమంటారా?” గృహస్థులు ఆసక్తి చూపిస్తే, దానియేలు 2:44 చదవండి. ఆ తర్వాత కావలికోట జనవరి - మార్చి సంచికను ఇచ్చి, 12వ పేజీలోని మొదటి ఉపశీర్షిక కిందవున్న సమాచారాన్ని చదివి చర్చించండి. పత్రిక ఇచ్చి, తర్వాతి ప్రశ్న చర్చించడానికి ఏర్పాటు చేసుకోండి.
కావలికోట జనవరి - మార్చి
“మనలో చాలామందికి, ఎంతో కష్టపడితేనే కనీస అవసరాలు తీరుతున్నాయి. కొందరికి అవి కూడా తీరట్లేదు. ఎవ్వరూ పేదవాళ్లుగా ఉండని రోజు ఒకటి వస్తుందంటారా? [వాళ్లేమి చెప్తారో వినండి. గృహస్థులు ఆసక్తి చూపిస్తే, పత్రికలోని 7వ పేజీలో నుండి కీర్తన 9:18 చదవండి.] పేదరికం ఎందుకుందో, ఈ సమస్యకు సరైన పరిష్కారం గురించి లేఖనాలు ఏమి చెబుతున్నాయో ఈ పత్రిక వివరిస్తుంది.”