కావలికోట ఆన్‌లైన్‌ లైబ్రరీ
కావలికోట
ఆన్‌లైన్‌ లైబ్రరీ
తెలుగు
  • బైబిలు
  • ప్రచురణలు
  • మీటింగ్స్‌
  • km 9/11 పేజీ 4
  • ప్రకటనలు

దీనికి ఏ వీడియో లేదు.

క్షమించండి, వీడియో లోడింగ్‌ అవట్లేదు.

  • ప్రకటనలు
  • మన రాజ్య పరిచర్య—2011
మన రాజ్య పరిచర్య—2011
km 9/11 పేజీ 4

ప్రకటనలు

▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? సెప్టెంబరు: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? మొదటిసారి కలిసినప్పుడే బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి ప్రయత్నించండి. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, వాళ్లు బైబిలు అధ్యయనం చేయడానికి ఇష్టపడకపోతే వాళ్లకు ఆసక్తివున్న అంశం గురించి తెలియజేసే ఏ పాత పత్రికైనా బ్రోషురైనా ఇవ్వవచ్చు. అక్టోబరు: కావలికోట పత్రిక. ఆసక్తివున్న వాళ్లకు, మీరు సత్యం తెలుసుకోవాలనుకుంటున్నారా? అనే కరపత్రం ఇచ్చి బైబిలు అధ్యయనం మొదలుపెట్టడానికి కృషిచేయండి. నవంబరు: బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది అనే బ్రోషుర్‌తోపాటు లేదా దీనికి బదులు మీ ప్రాంతంలోని ప్రజలకు ఆసక్తికరంగా ఉండే, మీ భాషలో అందుబాటులో ఉన్న 32 పేజీల బ్రోషుర్‌ ఏదైనా ఇవ్వవచ్చు. డిసెంబరు: జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి. చిన్న పిల్లలున్న వాళ్లకు గొప్ప బోధకుడు—ఆయన దగ్గర నేర్చుకోండి పుస్తకం లేదా నా బైబిలు కథల పుస్తకము ఇవ్వండి.

▪ 2012వ సంవత్సర జ్ఞాపకార్థ ఆచరణ కాలంలో ఉండే ప్రత్యేక బహిరంగ ప్రసంగం ఏప్రిల్‌ 2తో మొదలయ్యే వారంలో ఇవ్వబడుతుంది. అంశం తర్వాత తెలియజేయబడుతుంది. ఈ ప్రత్యేక బహిరంగ ప్రసంగాన్ని ఏ సంఘంలోనూ జ్ఞాపకార్థ ఆచరణకు ముందు ఇవ్వకూడదు.

▪ మార్చి 2012లో సహాయ పయినీరు సేవ చేసే ప్రచారకులకు 30 లేదా 50 గంటలు చేసే సౌలభ్యం ఉంటుంది. అంతేకాక, ప్రాంతీయ పర్యవేక్షకుడు మార్చి నెలలో సంఘాన్ని సందర్శిస్తున్నట్లయితే, సహాయ పయినీరు సేవ చేసే ప్రచారకులందరూ అంటే 30 గంటలు చేసేవాళ్లయినా 50 గంటలు చేసేవాళ్లయినా ప్రాంతీయ పర్యవేక్షకుడు క్రమ పయినీర్లతో జరిపే కూటం అంతటికీ హాజరుకావచ్చు.

▪ సెప్టెంబరు నుండి ప్రాంతీయ పర్యవేక్షకులు, “దేవుని సంతోషభరిత ప్రజలతో ఐక్యంకండి” అనే బహిరంగ ప్రసంగాన్నిస్తారు.

▪ అందుబాటులోవున్న కొత్త ప్రచురణలు:

దేవుని రాజ్యం గురించి ‘సమగ్ర సాక్ష్యమివ్వండి’! —తమిళం, మలయాళం

రక్తం విషయంలో వచ్చే సమస్యలను ఎదుర్కోవడానికి సహాయం—డీవీడీ —అమెరికన్‌ సంజ్ఞా భాష

యెహోవాకు కీర్తనలు పాడదాం—వాద్య బృందగానం—కాంపాక్ట్‌ డిస్క్‌, డిస్క్‌ 3

యెహోవాకు కీర్తనలు పాడదాం—వాద్య బృందగానం—కాంపాక్ట్‌ డిస్క్‌, డిస్క్‌ 4

    తెలుగు ప్రచురణలు (1982-2026)
    లాగౌట్‌
    లాగిన్‌
    • తెలుగు
    • షేర్ చేయి
    • ఎంపికలు
    • Copyright © 2026 Watch Tower Bible and Tract Society of Pennsylvania
    • వినియోగంపై షరతులు
    • ప్రైవసీ పాలసీ
    • ప్రైవసీ సెటింగ్స్‌
    • JW.ORG
    • లాగిన్‌
    షేర్‌ చేయి