దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2011 ఆగస్టు 29తో మొదలయ్యే వారంలోని దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ కింది ప్రశ్నలు పరిశీలిస్తాం.
1. దేవుని కృప ఎలా ‘జీవం కన్నా ఉత్తమమైనది’? (కీర్త 63:3) [w01 10/15 15వ పేజీ, 17వ పేరా]
2. దావీదు గురించి 70వ కీర్తన నుండి మనం ఏమి నేర్చుకోవచ్చు? [w08 9/15 4వ పేజీ, 4వ పేరా]
3. కీర్తన 75:5 దేని గురించి హెచ్చరిస్తుంది? [w06 7/15 11వ పేజీ, 2వ పేరా]
4. యెహోవా మన ప్రార్థనలు ప్రాముఖ్యంగా ఎప్పుడు వింటాడు? (కీర్త. 79:9) [w06 7/15 12వ పేజీ, 5వ పేరా]
5. కీర్తన 90:7, 8లో ప్రస్తావించబడిన “రహస్యపాపములు” ఏవి? [w01 11/15 12-13 పేజీలు, 14-16 పేరాలు]
6. కీర్తన 92:12-15 ప్రకారం, సంఘంలోని వృద్ధులకు ఏ ప్రాముఖ్యమైన బాధ్యత అప్పగించబడింది? [w04 5/15 13-14 పేజీలు, 14-18 పేరాలు]
7. కీర్తన 105:14, 15 అబ్రాహాము, ఆయన సంతానం విషయంలో ఎలా నిజమైంది? [w10 4/15 8వ పేజీ, 5వ పేరా]
8. కీర్తన 109:30, 31లో ఏ ఓదార్పుకరమైన మాటలు ఉన్నాయి? [w06 9/1 14వ పేజీ, 8వ పేరా]
9. కీర్తన 110:1, 4 ప్రకారం, యెహోవా వాగ్దత్త సంతానానికి లేదా మెస్సీయకు ఏ వాగ్దానం చేశాడు, దానివల్ల మానవజాతంతటికి ఎలాంటి ఆశీర్వాదాలు దొరుకుతాయి? [cl 194వ పేజీ, 13వ పేరా]
10. భూమి ‘వణకాలి’ అని కీర్తనకర్త అన్నప్పుడు దాని అర్థమేమిటి? (కీర్త. 114:3-7) [w06 9/1 14వ పేజీ, 10వ పేరా]