ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? మార్చి: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి పట్టుదలతో ప్రయత్నించండి. ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. ఆసక్తివున్నవాళ్లను లేదా జ్ఞాపకార్థ ఆచరణకుగానీ ఇతర దైవపరిపాలనా కార్యక్రమాలకుగానీ హాజరై, సంఘ కూటాలకు మాత్రం సరిగ్గా రానివాళ్లను తిరిగి కలుసుకుంటున్నప్పుడు వాళ్లకు బైబిలు బోధిస్తోంది పుస్తకంలో నుండి బైబిలు అధ్యయనం మొదలుపెట్టాలనే లక్ష్యాన్ని పెట్టుకోండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే, 192 పేజీల ఏ పాత పుస్తకాన్నైనా, 1995కు ముందు ప్రచురించిన ఏ పుస్తకాన్నైనా ఇవ్వవచ్చు.