దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో, 2010 అక్టోబరు 25తో ప్రారంభమయ్యే వారంలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. పాఠశాల పైవిచారణకర్త, 2010 సెప్టెంబరు 6 నుండి అక్టోబరు 25 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. మనం రాజైన అజర్యా (ఉజ్జియా) జీవితాన్ని పరిశీలించడం ద్వారా ఏ పాఠాన్ని నేర్చుకోవచ్చు? (2 రాజు. 15:1-6) [w05 10/15 25వ పేజీ, 19వ పేరా]
2. రెండవ రాజులు 13:20, 21 వచనాల్లోని అద్భుతం మతసంబంధమైన అస్థికలను పూజించడాన్ని సమర్థిస్తోందా? [w05 8/1 11వ పేజీ, 3వ పేరా]
3. హిజ్కియా ఐగుప్తుతో పొత్తు కుదుర్చుకున్నాడా? (2 రాజు. 18:19-21, 25) [w05 8/1 11వ పేజీ, 5వ పేరా]
4. యెహోవా తన సంకల్పాన్ని ‘నిర్ణయిస్తున్నట్లు’ లేదా ‘రూపిస్తున్నట్లు’ ఎందుకు చెప్పబడింది? (2 రాజు. 19:25) [w99 8/15 14వ పేజీ, 3వ పేరా]
5. యూదాను “క్షమించుటకు” యెహోవాకు ఎందుకు “మనస్సు లేకపోయెను”? (2 రాజు. 24:3, 4) [w05 8/1 12వ పేజీ, 1వ పేరా]
6. మొదటి సమూయేలు 16:10, 11 లో దావీదు యెష్షయి ఎనిమిదవ కుమారుడు అని రాసివుంటే ఎజ్రా ఏడవ కుమారుడు అని ఎందుకు రాశాడు? (1 దిన. 2:15) [w05 10/1 9వ పేజీ, 2వ పేరా]
7. ప్రాచీనకాల యొర్దానుకు తూర్పున ఉన్న గోత్రాల మాదిరిని మనం ఎలా అనుకరించవచ్చు? (1 దిన. 5:10, 18-22) [w05 10/1 9వ పేజీ, 8వ పేరా]
8. లేవీ గోత్రానికి చెందిన ద్వారపాలకుల నుండి మనం ఏ పాఠం నేర్చుకోవచ్చు? (1 దిన. 9:26, 27) [w05 10/1 9వ పేజీ, 9వ పేరా]
9. రెండవ సమూయేలు 23:8 లోవున్న ఇదే వృత్తాంతం హతులైనవారు 800 మంది అని చెబుతుంటే ఈ వచనం హతులైనవారు 300 మంది అని ఎందుకు చెబుతోంది? (1 దిన. 11:11) [w05 10/1 10వ పేజీ, 3వ పేరా]
10. మొదటి దినవృత్తాంతములు 13:11 లో వివరించబడిన దావీదు స్పందనలో ఉన్న తప్పేంటి? [w05 10/1 11వ పేజీ, 2వ పేరా]