ఆగస్టు 9తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 9తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 21-22
నం. 1: 1 రాజులు 22:1-12
నం. 2: జతగానే వృద్ధులు కావడం (fy 163వ పేజీ, 1-3 పేరాలు)
నం. 3: ఏలీయా ఉదాహరణ ప్రార్థన గురించి మనకేమి బోధిస్తోంది? (యాకో. 5:18)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ప్రగతిదాయక బైబిలు అధ్యయనాలను నిర్వహించడం. ఆగస్టు 2004 మన రాజ్య పరిచర్య, 1వ పేజీలోవున్న ఆర్టికల్‌ను ఉపయోగిస్తూ ప్రేక్షకులతో చర్చ. బైబిలు అధ్యయనాలను నిర్వహించి, బైబిలు విద్యార్థులు సమర్పించుకునేంతగా అభివృద్ధి సాధించేలా వాళ్లకు సహాయం చేయాలన్న లక్ష్యం పెట్టుకోమని ప్రచారకులను ప్రోత్సహించండి.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—4వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 115వ పేజీలోని 4వ పేరా నుండి 116వ పేజీలోని 3వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రసంగం. బెతెల్‌లో సేవ చేసిన లేదా చేస్తున్న, రాజ్య మందిర నిర్మాణ పనికి మద్దతునిచ్చిన ఒకరిద్దరు ప్రచారకులను ఇంటర్వ్యూ చేయండి. ఆ సేవ చేస్తున్నప్పుడు వాళ్లు ఎలాంటి సంతోషాన్ని పొందారో చెప్పమనండి.
10 నిమి: “క్రైస్తవ పరిచారకుల కోసం ఒక ఏర్పాటు.” ప్రశ్నాజవాబుల చర్చ. ప్రాంతీయ సమావేశాలు ఎప్పుడు జరుగుతాయో తెలిస్తే, చెప్పండి. ఇటీవల జరిగిన ప్రాంతీయ సమావేశం నుండి ఎలా ప్రయోజనం పొందారో చెప్పమని ప్రేక్షకులను అడగండి.