ఆగస్టు 2తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
ఆగస్టు 2తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 10వ అధ్యా. 9-15 పేరాలు, 130వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 1 రాజులు 18-20
నం. 1: 1 రాజులు 18:21-29
నం. 2: భూమి, ఆకాశము గతించిపోవడమంటే అర్థమేమిటి? (ప్రక. 21:1)
నం. 3: విడిపోయేందుకుగల ఆధారాలు (fy 160-162 పేజీలు, 17-22 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: మీ పరిచర్యను విస్తృతం చేసుకునే మార్గాలు—3వ భాగం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 114వ పేజీ 1వ పేరా నుండి 115వ పేజీ 3వ పేరా వరకున్న సమాచారం ఆధారంగా ప్రసంగం. మీ సంఘంలో పయినీరు సేవా పాఠశాల, పరిచర్య శిక్షణా పాఠశాల లేదా గిలియడ్ పాఠశాలకు హాజరైన ఆదర్శవంతమైన ప్రచారకుల్లో ఎవరినైనా ఇంటర్వ్యూ చేయండి, వాళ్ళు ఆ శిక్షణ నుండి ఎలా ప్రయోజనం పొందారో అడగండి. అలాంటి వారెవరూ మీ సంఘంలో లేకపోతే, ప్రచురించబడిన అనుభవాలను చెప్పండి.
10 నిమి: స్థానిక అవసరాలు.
10 నిమి: బైబిలు అధ్యయనాలు ప్రారంభించిన అనుభవాలు. ప్రేక్షకులతో చర్చ. కొత్త బైబిలు అధ్యయనాలు ప్రారంభించడానికి స్థానికంగా ప్రచారకులు ఏమి చేశారో ప్రస్తావించండి. తమకు ఎదురైన అనుభవాలను చెప్పమని ప్రేక్షకులను అడగండి. ప్రోత్సాహకరంగా ఉన్న ఒకటి లేదా రెండు అనుభవాలను పునర్నటింపజేయవచ్చు. మొదటి సందర్శనంలోనే బైబిలు అధ్యయనాన్ని ఎలా ప్రారంభించవచ్చో ప్రదర్శిస్తూ ముగించండి.