మే 17తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 17తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 7వ అధ్యా. 1-9 పేరాలు, 88, 90 పేజీల్లోని బాక్సులు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 9-12
నం. 1: 2 సమూయేలు 10:1-12
నం. 2: కుటుంబం ఏమి చేయవచ్చు? (fy 143, 144 పేజీలు, 5-8 పేరాలు)
నం. 3: లోభత్వం విగ్రహారాధనతో సమానమని ఎందుకు చెప్పవచ్చు? (ఎఫె. 5:5)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: వేసవిలో మీరు సహాయ పయినీరు సేవ చేయగలరా? ప్రేక్షకులతో చర్చ. సంస్థీకరించబడ్డాం పుస్తకంలో 112-113 పేజీల్లో ఉన్న అర్హతలను సంక్షిప్తంగా సమీక్షించండి. పయినీరు సేవ చేయడానికి స్కూలు సెలవులను లేదా ఆఫీసు సెలవులను ఉపయోగించుకున్న వారిని, తాము పొందిన ఆశీర్వాదాలను చెప్పమని అడగండి.
10 నిమి: సువార్త ప్రకటించే పద్ధతులు—అనియత సాక్ష్యం. సంస్థీకరించబడ్డాం పుస్తకంలోని 101వ పేజీ, 2వ పేరా నుండి 102వ పేజీ, 2వ పేరా వరకు ఉన్న సమాచారం ఆధారంగా ప్రేక్షకులతో చర్చ. అనియత సాక్ష్యం ఇచ్చిన వారి అనుభవాలను చెప్పమనండి లేదా పునర్నటించి చూపించమనండి.
10 నిమి: “క్రైస్తవ పరిచారకులు ప్రార్థించాలి.” ప్రశ్నాజవాబుల చర్చ.