దైవపరిపాలనా పరిచర్య పాఠశాల పునఃసమీక్ష
2010, ఏప్రిల్26తో ప్రారంభమయ్యే వారంలో దైవపరిపాలనా పరిచర్య పాఠశాలలో ఈ క్రింది ప్రశ్నలు పరిశీలించబడతాయి. 2010, మార్చి 1 నుండి ఏప్రిల్ 26 మధ్య వారాల్లోని నియామకాల సమాచారం ఆధారంగా పాఠశాల పైవిచారణకర్త 20 నిమిషాలు పునఃసమీక్ష చేస్తాడు.
1. నయోమి ఏ ఉద్దేశంతో “యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను, సర్వశక్తుడు నన్ను బాధపరచెను” అని అంది? (రూతు 1:21) [w05 3/1 27వ పేజీ, 2, 4 పేరాలు]
2. రూతు ‘యోగ్యురాలు’ అని ఎలా పేరు తెచ్చుకోగలిగింది? (రూతు 3:11) [w05 3/1 28వ పేజీ, 6వ పేరా]
3. “పదిమంది కుమాళ్లకంటె నేను నీకు విశేషమైనవాడను కానా?” అని ఎల్కానా అన్న మాటలు ఆయన భార్యను ఎలా బలపర్చాయి? (1 సమూ. 1:8) [w05 3/15 22వ పేజీ, 3వ పేరా]
4. ఇశ్రాయేలీయులు తమకొక రాజు కావాలని అడగడం ఎందుకు సరైంది కాదు? (1 సమూ. 8:5) [w05 9/15 20వ పేజీ, 17వ పేరా]
5. ‘తల నెరిసిన ముసలివాడైన’ సమూయేలు ఇతరుల కోసం ప్రార్థించడంలో ఎలాంటి మాదిరినుంచాడు, దాని నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 12:2, 23) [w07 6/1 29వ పేజీ, 13-15 పేరాలు]
6. సౌలు కేనీయులపై ప్రత్యేకమైన దయను ఎందుకు చూపించాడు? (1 సమూ. 15:6) [w05 3/15 22వ పేజీ, 10వ పేరా]
7. మొదటి సమూయేలు 16:17-23 వచనాల దృష్ట్యా, దావీదు ఎవరి కుమారుడని సౌలు ఎందుకు అడిగాడు? (1 సమూ. 17:58) [w05 3/15 24వ పేజీ, 1వ పేరా]
8. గాతులో ఒక పెద్ద సమస్య వచ్చినప్పుడు దావీదు వ్యవహరించిన తీరు నుండి మనమేమి నేర్చుకోవచ్చు? (1 సమూ. 21:12, 13) [w05 3/15 24వ పేజీ, 5వ పేరా]
9. తన స్నేహితుడైన దావీదుకు మద్దతిచ్చి, ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడినప్పుడు యోనాతానుకున్న ప్రేమ, అణుకువ ఎలా కనబడ్డాయి? (1 సమూ. 23:17) [lv 32వ పేజీ, 10వ పేరా, అధస్సూచి.]
10. సౌలు ఏన్దోరులో ఉన్న కర్ణపిశాచిగల స్త్రీ దగ్గరకు వెళ్లినప్పుడు జరిగినదాని నుండి మనం ఏ పాఠం నేర్చుకుంటాము? (1 సమూ. 28:8-19) [w05 3/15 24వ పేజీ, 8వ పేరా]