ప్రకటనలు
▪ ఏ నెలలో ఏమి ఇవ్వాలి? ఏప్రిల్, మే: కావలికోట పత్రిక. జ్ఞాపకార్థ ఆచరణకు లేదా ఇతర దైవపరిపాలనా సంఘటనలకు హాజరవుతూ సంఘంతో మాత్రం క్రియాశీలంగా సహవసించనివారిని, ఆసక్తిగలవారిని పునర్దర్శనం చేస్తున్నప్పుడు వారికి బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? అనే పుస్తకాన్ని ఇవ్వండి. ముఖ్యంగా బైబిలు అధ్యయనం ప్రారంభించాలనే లక్ష్యంతో ఉండండి. జూన్: బైబిలు నిజంగా ఏమి బోధిస్తోంది? పుస్తకం. గృహస్థుల దగ్గర ఈ పుస్తకం అప్పటికే ఉంటే 1995కు ముందు ప్రచురించబడిన 192 పేజీల ఏ పుస్తకాన్నైనా అందించవచ్చు. జూలై, ఆగస్టు: ఈ కింద ఇవ్వబడిన 32 పేజీల బ్రోషుర్లలో అందుబాటులో ఉన్న దేన్నైనా అందించవచ్చు: అప్రమత్తంగా ఉండండి!, ఇదిగో! నేను సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు?, త్రిత్వమును మీరు నమ్మవలయునా?, దేవుడు మనయెడల నిజంగా శ్రద్ధ కల్గియున్నాడా?, పరదైసును తీసికొనివచ్చు ప్రభుత్వము, మీరు ప్రేమిస్తున్నవారెవరైనా చనిపోతే, మన సమస్యలు—వాటిని పరిష్కరించుటకు ఎవరు సహాయము చేయుదురు?, సర్వమానవాళి కొరకైన గ్రంథం, సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు.
▪ జిల్లా సమావేశం గానీ, ప్రాంతీయ సమావేశం గానీ, ప్రత్యేక దిన సమావేశం గానీ జరిగే వారంలో సంఘంలో సంఘ బైబిలు అధ్యయనం, దైవపరిపాలనా పరిచర్య పాఠశాల, సేవా కూటం ఆ వారంలో జరగవు. కాబట్టి కుటుంబ అధ్యయన సాయంకాలం, ఆ వారంలో జరిగే ఈ మూడు కూటాల్లోని సమాచారాన్ని పరిశీలించమని అందరినీ ప్రోత్సహిస్తున్నాము.
▪ 2010వ సంవత్సరంలో జ్ఞాపకార్థ ఆచరణ తర్వాత ఇవ్వబడే ప్రత్యేక బహిరంగ ప్రసంగ శీర్షిక: “నిజమైన శాంతిభద్రతలు ఎప్పుడొస్తాయి?”
▪ అందుబాటులో ఉన్న కొత్త ప్రచురణలు:
వాచ్‌టవర్ పబ్లికేషన్స్ ఇండెక్స్ 2008
—అమెరికన్ సంజ్ఞా భాష
బైబిలు—దానిలో మీకు ఒక సందేశం ఉంది —ఉర్దూ
▪ మళ్లీ అందుబాటులో ఉన్న ప్రచురణలు:
జీవించిన వారిలోకెల్లా మహాగొప్ప మనిషి
—ఆంగ్లం, తమిళం, తెలుగు, మలయాళం, హిందీ
యువత అడిగే ప్రశ్నలు—ఆచరణాత్మకమైన సమాధానాలు —ఆంగ్లం, నేపాలీ, మలయాళం, హిందీ
అద్వితీయ సత్య దేవుణ్ణి ఆరాధించండి —నేపాలీ
సర్వమానవాళి కొరకైన గ్రంథం —నేపాలీ
సంతృప్తికరమైన జీవితం—దాన్నెలా సాధించవచ్చు
—తెలుగు, మరాఠీ, మలయాళం
యెహోవాసాక్షులు—వారు ఎవరు?
—కన్నడ, మిజో, హిందీ
జీవిత సంకల్పమేమిటి—మీరు దానినెలా తెలిసికోగలరు? —కన్నడ