మే 3తో ఆరంభమయ్యే వారంలో జరిగే సేవా కార్యక్రమ
మే 3తో మొదలయ్యే వారం
❑ సంఘ బైబిలు అధ్యయనం:
lv 6వ అధ్యా. 10-15 పేరాలు, 77వ పేజీలోని బాక్సు
❑ దైవపరిపాలనా పరిచర్య పాఠశాల:
బైబిలు పఠనం: 2 సమూయేలు 1-3
నం. 1: 2 సమూయేలు 2:12-23
నం. 2: యేసు తన పరిచర్యలో దేవుని పేరు ఉపయోగించాడా?
నం. 3: వస్తు సంబంధ గురులు మీ గృహాన్ని విభజిస్తున్నాయా? (fy 140, 141 పేజీలు, 26-28 పేరాలు)
❑ సేవా కూటం:
5 నిమి: ప్రకటనలు.
10 నిమి: ‘బైబిలు అధ్యయనాలు నిర్వహించేందుకు “దేవుని ప్రేమ” పుస్తకాన్ని ఎలా ఉపయోగించాలి?’ ఉపోద్ఘాతాన్ని నిమిషంకన్నా తక్కువ సమయంలో ముగించిన తర్వాత, ఆర్టికల్‌ను ప్రశ్నజవాబులతో చర్చించండి.
20 నిమి: “‘అసమయంలో’ కూడా పరిచర్య చేయడానికి మనకు శిక్షణ లభించింది.” ప్రేక్షకులతో చర్చ. మన రాజ్య పరిచర్య గత సంచికల్లో నుండి సముచితమైన అంశాలను సంఘానికి గుర్తుచేయండి. సేవా పైవిచారణకర్తను ఇంటర్వ్యూ చేయండి. ఇవ్వబడిన సూచనలను సంఘమెలా అనుసరించింది? అలా అనుసరించడం వల్ల సంఘానికి ఎలాంటి ప్రయోజనం చేకూరింది? ఇంకా ఏ రంగాల్లో సంఘం అభివృద్ధి సాధించాల్సివుంది? సమస్యలు వచ్చిన తర్వాత వాటిని పరిష్కరించడానికి బదులు, అసలు సమస్యల్లో చిక్కుకోకుండా ఉండేందుకు వివేచనతో నేర్పుగా పరిచర్య చేయడం ఎంత ప్రాముఖ్యమో నొక్కిచెప్పండి.